Rashmika Mandanna Love To Buy These Things Mostly

Rashmika Mandanna: నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మిక మంద‌న్నా ప్ర‌స్తుతం కెరీర్ ప‌రంగా ఫుల్ స్వింగ్ లో దూసుకుపోతున్న సంగ‌తి తెలిసిందే. సౌత్‌, నార్త్ అనే తేడా లేకుండా అన్ని భాష‌ల్లోనూ సినిమాలు చేస్తూ బిజీ షెడ్యూల్‌ను మెయింటైన్ చేస్తోంది. గ‌త ఏడాది యానిమ‌ల్ మూవీతో పాన్ ఇండియా స్థాయిలో భారీ విజ‌యాన్ని అందుకున్న ర‌ష్మిక ఇప్పుడు దాదాపు ఐదు చిత్రాల్లో భాగ‌మైంది. తెలుగులో ఈ బ్యూటీ అల్లు అర్జున్ కు జోడీగా పుష్ప 2లో యాక్ట్ చేస్తోంది.

Rashmika Mandanna Love To Buy These Things Mostly

అలాగే ధ‌నుష్, శేఖ‌ర్ క‌మ్ముల కాంబినేష‌న్ లో ఈ సినిమా తెర‌కెక్కుతోంది. ఇందులో హీరోయిన్ గా ర‌ష్మిక ఎంపిక అయింది. రెయిన్ బో అనే తెలుగు, త‌మిళ్ ద్విభాషా చిత్రంలో న‌టిస్తోంది. ది గార్ల్‌ఫ్రెండ్ అనే ఓ సినిమాకు సంత‌కం చేసింది. వీటితో పాటు బాలీవుడ్ లో ర‌ష్మిక ఓ మూవీ చేసింది. ప్ర‌స్తుతం ఈ ఐదు ప్రాజెక్ట్స్ సెట్స్ మీదే ఉన్నాయి. దీంతో గ‌త కొద్ది రోజుల నుంచి బ్యాక్ టు బ్యాక్ షూటింగ్స్ తో ర‌ష్మిక చాలా బిజీగా గ‌డిపింది.

Rashmika Mandanna Love To Buy These Things Mostly

ఈ నేప‌థ్యంలోనే వ‌ర్క్ మూడ్ నుంచి కాస్త బ‌య‌ట‌కు వ‌చ్చేందుకు ర‌ష్మిక ఫారెన్ చెక్కేసింది. ఐకానిక్ జ‌ప‌నీస్ ఫ్యాష‌న్ బ్రాండ్ ఒనిట్సుకా టైగ‌ర్ అంబాసిడ‌ర్ గా మారిన ర‌ష్మిక‌.. ఇటీవ‌ల స‌ద‌రు బ్రాండ్ ప్ర‌మోష‌న్ కోసం జ‌పాన్ వెళ్లింది. అక్క‌డ నుంచి కాస్త చిల్ అయ్యేందుకు ఆస్ట్రేలియా వెళ్లింది. అక్క‌డ ఫుల్ గా ఎంజాయ్ చేసింది. త‌న ఆస్ట్రేలియా ట్రిప్ కు సంబంధించిన ఫోటోల‌ను కూడా సోష‌ల్ మీడియాలో పంచుకుంది.(Rashmika Mandanna)

Also Read: Shivani Rajashekar: ఇండ‌స్ట్రీలో క‌లిసిరాని అదృష్టం.. యాక్టింగ్ కు గుడ్‌బై చెప్పి ఆ ప‌నికి సిద్ధ‌మ‌వుతున్న శివాని రాజశేఖర్‌!

ఈ క్ర‌మంలోనే టాయ్స్ పై త‌న‌కున్న మక్కువ‌ను బ‌య‌ట‌పెట్టింది. సాధార‌ణంగా చిన్న పిల్ల‌లే టాయ్స్ కు ఎట్రాక్ట్ అవుతుంటారు. అయితే ర‌ష్మిక‌కు కూడా టాయ్స్ అంటే చాలా ఇష్ట‌మ‌ట‌. ముఖ్యంగా సాఫ్ట్ టాయ్స్ ను ఆమె ఎక్కువ‌గా ఇష్ట‌ప‌డుతుంద‌ట‌. అంతేకాదు ఎప్పుడూ ఫారెన్ కంట్రీస్ వెళ్లినా సాఫ్ట్ టాయ్స్ ను కొనుకుండా రాద‌ట‌. త‌న ఆస్ట్రేలియా ట్రిప్ లో కూడా ర‌ష్మిక కొన్ని సాఫ్ట్ టాయ్స్ ను తీసుకుంది. పైగా వాటిని ఫోటోలు దిగి సోష‌ల్ మీడియా ద్వారా షేర్ చేసింది.

Join WhatsApp