Ravi Teja Eagle Movie First Review Out Now

Eagle: మాస్ మ‌హారాజా ర‌వితేజ 2024లో త‌న మొద‌టి సినిమాతో అల‌రించేందుకు రెడీ అవుతున్నారు. ఈగ‌ల్ తో థియేట‌ర్స్ లోకి దిగ‌బోతున్నారు. యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ గా రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి కార్తీక్ ఘట్టమనేని ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్, కావ్య థాపర్ హీరోయిన్లుగా న‌టించారు. అలాగే నవదీప్, వినయ్ రాయ్, మధుబాల, అవ‌స‌రాల శ్రీ‌నివాస్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. దవ్‌జాంద్ స్వ‌రాలు అందించాడు.

Ravi Teja Eagle Movie First Review Out Now

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యాన‌ర్ పై టీజీ విశ్వప్రసాద్‌, వివేక్‌ కూచిభొట్ల నిర్మించిన ఈగ‌ల్ చిత్రం.. మకర సంక్రాంతి సందర్భంగా జనవరి 13 విడుదలవుతుందని ముందుగా ప్రకటించారు. కానీ, టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద పలు చిత్రాల క్లాష్ కారణంగా.. ఈగ‌ల్ రిలీజ్ ను పోస్ట్ పోన్ చేశారు. ఫైన‌ల్ గా ఫిబ్ర‌వ‌రి 9న ఈగ‌ల్ ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. అయితే విడుద‌ల‌కు మూడు రోజుల ముందే ఈ సినిమా యొక్క ఫ‌స్ట్ రివ్యూ బ‌య‌ట‌కు వ‌చ్చింది.

ర‌వితేజ స్వ‌యంగా త‌న సినిమాపై రివ్యూ ఇచ్చారు. తాజాగా హైద‌రాబాద్ లో ఈగ‌ల్ ప్రివ్యూ షో వేశారు. ఈ షోకు మాస్ మ‌హారాజా ర‌వితేజ‌, డైరెక్ట‌ర్ కార్తీక్‌, నిర్మాతలు టీజీ విశ్వప్రసాద్‌, వివేక్‌ కూచిభొట్లతో పాటు మ‌రికొంద‌రు సినిమా టీమ్ స‌భ్యులు, టాలీవుడ్ ప్ర‌ముఖులు పాల్గొన్నారు. అయితే ఈగ‌ల్‌ ప్రివ్యూ చూసిన ర‌వితేజ ఫుల్ హ్యాపీగా క‌నిపించారు. ఈగ‌ల్ అవుట్‌పుట్ విష‌యంలో ఐ యామ్ సూప‌ర్ సాటిస్పైడ్ అంటూ కామెంట్స్ చేశారు.(Eagle)

Also Read: Balakrishna: బాల‌కృష్ణ‌ సినిమాల్లో ఆయ‌న భార్య‌ వ‌సుంధ‌ర‌కు అత్యంత ఇష్ట‌మైనది ఏదో తెలుసా?

స్వీట్ అండ్ షార్ట్ గా సినిమా బాగుంద‌ని ర‌వితేజ ఫ‌స్ట్ రివ్యూ ఇచ్చారు. డైరెక్ట‌ర్ కార్తీక్‌ను కూడా అభినందించారు. ఇందుకు సంబంధించిన వీడియోను నిర్మాత‌లు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ యొక్క అఫీషియ‌ల్ ఎక్స్‌(ట్విట్ట‌ర్‌) అకౌంట్ లో పంచుకున్నారు. ర‌వితేజ సినిమా ప‌ట్ల ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. అలాగే సినిమా చూసిన మిలిగిన వారు కూడా చాలా పాజిటివ్ గా స్పందించార‌ట‌. ర‌వితేజ‌కు హిట్ ఖాయ‌మ‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. కాగా, ఒక హిట్టు ప‌డితే నాలుగు ఫ్లాపులు అన్న‌ట్లుగా ర‌వితేజ కెరీర్ సాగుతోంది. మ‌రి ఆయ‌నకు ఈగ‌ల్ సినిమా ఎలాంటి విజ‌యాన్ని అందిస్తుందో చూడాలి.

Join WhatsApp