Prashanth Varma's new movie "Hanuman"

Ravi Teja: యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జ హీరోగా అమృత అయ్యర్ హీరోయిన్ గా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ” హనుమాన్ “. చిన్న సినిమాగా రిలీజ్ అయిన ఈ మూవీ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.

Ravi Teja: Prashanth Varma’s new movie “Hanuman”

ఇక సంక్రాంతి బరిలో గుంటూరు కారానికి పోటీగా నిలబడ్డ ఈ మూవీ మహేష్ సినిమానే తలదన్నింది. ఇక లాంగ్ రన్ లో కూడా వరస వసూళ్లను సాధిస్తూ దూసుకుపోతుంది. ఈ క్రమంలోనే వరుస ఇంటర్వ్యూస్ కి హాజరవుతున్నారు చిత్ర బృందం. ఇక తాజాగా ఈ మూవీ సక్సెస్ మీట్ ని హైదరాబాద్ లో జరుపుకున్నారు.

Also Read: Niharika: ఆ యంగ్ హీరోయిన్ తో హోటల్ రూమ్ లో జొన్నలగడ్డ చైతన్య.. అందుకే నిహారిక వదిలేసిందా..?

ఈ తరుణంలోనే ప్రశాంత్ వర్మ తన నెక్స్ట్ మూవీ పై కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈయన మాట్లాడుతూ..” హనుమాన్ మూవీలో కోతి పాత్రకి రవితేజ గారు చాలా బాగా డబ్బింగ్ చెప్పారు. రవితేజ గారే కనుక నాతో సినిమాని ఒప్పుకుంటే నేను ఈ కోతి కథతో ఓ సినిమా తీస్తా. అది తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది.

Prashanth Varma's new movie "Hanuman"

ఆయన ఒక్క మాట చెబితే చాలు ” అంటూ చెప్పుకొచ్చాడు ప్రశాంత్ వర్మ. ప్రస్తుతం ప్రశాంత్ వర్మ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా..” రవితేజని మాస్ అండ్ క్లాస్ గెటప్ లో చూసాము కానీ నువ్వు చెప్పిన గెటప్ లో ఇప్పటివరకు చూడలేదు బ్రో. నీతో సినిమా చేయడానికి రవితేజ గారు ఓకే చెప్పాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ” అంటూ కామెంట్స్ చేస్తున్నారు ప్రేక్షకులు.(Ravi Teja)

Join WhatsApp