Ravi Teja Remuneration And Net Worth Details

Ravi Teja: ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా సినిమా ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చి అంచెలంచెలుగా ఎదుగుతూ స్టార్ హీరోగా గుర్తింపు సంపాదించుకున్న తెలుగు హీరోల్లో ర‌వితేజ ఒక‌రు. అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా కెరీర్ ప్రారంభించిన ర‌వితేజ‌.. ఆ త‌ర్వాత న‌టుడిగా మారారు. చిన్న చిన్న పాత్ర‌ల‌తో మొద‌లు పెట్టి హీరో స్థాయికి ఎదిగారు. స్టార్ ఇమేజ్ ను సంపాదించుకున్నారు. ఇప్ప‌టికీ హిట్లు ఫ్లాపుల‌తో సంబంధం లేకుండా వ‌రుస సినిమాలు చేస్తూ కెరీర్ ను ప‌రుగులు పెట్టిస్తున్నారు.

Ravi Teja Remuneration And Net Worth Details

ఏడాదికి రెండుకు త‌గ్గుకుండా చిత్రాల‌తో అల‌రిస్తూ కుర్ర‌కారుకు గ‌ట్టి పోటీ ఇస్తున్న ర‌వితేజ బ‌ర్త్‌డే నేడు. దీంతో సినీ ప్రియులు, అభిమానులు ఆయ‌న‌కు సోష‌ల్ మీడియా ద్వారా బ‌ర్త్‌డే విషెస్ తెలుపుతున్నారు. మ‌రోవైపు ర‌వితేజకు సంబంధించి అనేక విష‌యాలు తెర‌పైకి వ‌స్తున్నారు. ఈ నేప‌థ్యంలోనే మాస్ మ‌హారాజా ఆస్తులు మ‌రియు రెమ్యున‌రేష‌న్ వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

Also Read: Mrunal Thakur: అడుక్కుంటున్నా ఛాన్సులు రావ‌డం లేదు.. ఆవేదనంతా వెల్లగక్కిన మృణాల్!

ఈ జ‌న‌రేష‌న్ టాప్ స్టార్స్ కు ఏ మాత్రం తీసిపోని విధంగా ర‌వితేజ రెమ్యున‌రేష‌న్ తీసుకుంటున్నాడు. క్రాక్ మూవీకి ముందు వ‌ర‌కు రూ. 12 కోట్ల కంటే త‌క్కువే ర‌వితేజ తీసుకునేవారు. కానీ, క్రాక్ త‌ర్వాత ఆయ‌న‌ ఒక్కో చిత్రానికి రూ. 20 కోట్ల రేంజ్ లో పారితోషికం అందుకుంటున్నాడ‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో టాక్ ఉంది. అలాగే ప‌లు నివేదిక‌ల ప్ర‌కారం.. ర‌వితేజ ఆస్తుల విలువ రూ. 150 కోట్లు అని తెలుస్తోంది. హైదరాబాద్ తో సహా ప‌లు న‌గ‌రాల్లో రూ. 30 కోట్ల విలువ చేసే ఇళ్లు ర‌వితేజ పేరిట ఉన్నాయట.(Ravi Teja)

Ravi Teja Remuneration And Net Worth Details

అలాగే రూ. 50 కోట్లు విలువైన ఫ్లాట్లు, రూ. 6 కోట్లు విలువైన కార్లు ర‌వితేజ‌కు ఉన్నాయి. మ‌రియు ఆయ‌న‌కు సొంతూరులో పొలాలు కూడా ఉన్నాయ‌ని అంటున్నారు. కాగా, ర‌వితేజ హీరోగా చేతి నిండా సినిమాల‌తో బిజీగా ఉన్నారు. మ‌రోవైపు నిర్మాత‌గానూ స‌త్తా చాటుతున్నారు. ర‌వితేజ న‌టించిన ఈగ‌ల్ మూవీ ఫిబ్ర‌వ‌రి 9న విడుద‌ల కాబోతోంది. కార్తీక్ ఘట్టమనేని డైరెక్ట్ చేసిన చిత్రంలో అనుపమ పరమేశ్వరన్, కావ్య థాపర్ హీరోయిన్లుగా న‌టించారు. సంక్రాంతికే ఈగ‌ల్ రిలీజ్ కావాల్సి ఉంది. కానీ, భారీ పోటీ కార‌ణంగా చిత్ర టీమ్ వెన‌క‌డుగు వేసింది.

Join WhatsApp