Razakar movie director that anchor husband

Razakar movie: ప్రస్తుతం ఇండస్ట్రీ మొత్తం రజాకార్ సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు. ఈ సినిమా నిజాం రాజు పాలన కి అద్దం పట్టేలా ఉండడంతో చాలామంది ఈ సినిమా చూడడానికి ఆసక్తి చూపిస్తున్నారు. అయితే ఈ సినిమా హిట్ టాక్ తెచ్చుకున్నప్పటికీ బిజెపి ఈ సినిమాని మతం పేరుతో వాడుకోవడం వల్ల ఓ వర్గం ప్రజలు ఈ సినిమా చూడటం లేదట. అయితే రజాకార్ సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ట్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నారు యాట సత్యనారాయణ.

Razakar movie director that anchor husband

ఇక ఈ సినిమా చాలా అద్భుతంగా ఉండడంతో అందరూ ఈ డైరెక్టర్ ని మెచ్చుకుంటున్నారు. అయితే ఈ సినిమాకి బిజెపి వాళ్లు ప్రచారం చేయకపోతే కచ్చితంగా అన్ని వర్గాల ప్రజలు ఈ సినిమాను చూసేవారు. ఇక మత రాజకీయాలు కాసేపు పక్కన పెడితే ఈ సినిమా కచ్చితంగా ప్రతి ఒక్క ప్రేక్షకుడ్ని అలరిస్తుంది అని చెప్పవచ్చు. అయితే అలాంటి ఈ సినిమా డైరెక్టర్ యాట సత్యనారాయణ సినిమా డైరెక్టర్ కాకముందే కొన్ని సీరియల్స్ కి దర్శకత్వం చేశారట.(Razakar movie)

Also Read: Naga Chaitanya: తనకి సాయి పల్లవి పై ఉన్న ఇష్టాన్ని సమంతాతో షేర్ చేసుకున్న చైతు.. వీడియో వైరల్..!

అలా ఈయన బుల్లితెర పై కొన్ని సీరియల్స్ కి దర్శకత్వం చేశారు.అయితే ఈయన రాఘవేంద్రరావు దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా చేస్తున్న సమయంలో రాజమౌళి కూడా అక్కడే వర్క్ చేశారట. అలాగే హీరో నాని కూడా తనకు తెలుసని, కానీ నాని హీరో అయ్యాక తనతో కనీసం మాట కూడా మాట్లాడడం లేదని అసహనం వ్యక్తం చేశారు. ఇక ఈ విషయాలన్నీ పక్కన పెడితే రజాకార్ మూవీకి దర్శకత్వం వహించిన యాట సత్యనారాయణ ఎవరో కాదు ఒకప్పటి స్టార్ యాంకర్ భర్త..

Razakar movie director that anchor husband

ఆమె ఎవరో కాదు నవీన.. నవీన బుల్లితెరపై యాంకర్ గా చేస్తూనే చాలా సీరియల్స్ లో నటిగా రాణించింది. ఇక నవీన భర్తనే ఈ యాట సత్యనారాయణ..సీరియల్స్ లో చేసే సమయంలో వీరి మధ్య ఏర్పడిన పరిచయం పెళ్ళి వరకు వెళ్లిందట.ఇక ప్రస్తుతం అయితే నవీనకు సీరియల్స్ లో ఎక్కువగా ఛాన్సులు రావడం లేదు గాని సోషల్ మీడియా ద్వారా అభిమానులకు దగ్గరగానే ఉంటుంది.(Razakar movie)

Join WhatsApp