Reason Behind Tollywood Pan India Films Getting Postponement

Tollywood: ఈ ఏడాది ఎన్నో పాన్ ఇండియా సినిమాలు థియేటర్లో విడుదల కావడానికి సిద్ధమవుతున్నాయి. ఇందులో ప్రభాస్ నటించిన కల్కి.. ఎన్టీఆర్ నటిస్తున్న దేవర, అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమాల మీద ఫుల్ ఫోకస్ ఉన్నట్టుగా కనిపిస్తోంది. అయితే ఈ సినిమాలన్నీ కూడా ఇప్పుడు పోస్ట్ పోన్ అవుతున్నట్లుగా తెలుస్తోంది. అందుకు గల కారణం ఏంటో అభిమానులకు అంత చిక్కడం లేదు.. కానీ ఒక విషయం మాత్రం వైరల్ గా మారుతోంది .వాటి గురించి చూద్దాం.

Reason Behind Tollywood Pan India Films Getting Postponement

దేవర సినిమా విషయానికి వస్తే ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్లో ఈ సినిమాని పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కిస్తున్నారు. ముఖ్యంగా రెండు భాగాలుగా తెరకెక్కించబోతున్నామంటూ ఈ సినిమా సగం షూటింగ్ అయిపోయిన తర్వాత తెలియజేశారు.. ఏప్రిల్ 5న ఈ సినిమాని ఏడాది విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు.. ఈ సినిమా రిలీజ్ కావడం ఖాయమని అభిమానులు అనుకున్నారు.. కానీ ఇంకా షూటింగ్ పూర్తి కాకపోవడంతో పాటు సైఫ్ అలీ ఖాన్ కి ఇందులో గాయాలు అవ్వడం..VFX వర్క్ వల్ల కాస్త సమయం పట్టేలా ఉన్నది. ఆగస్టులో విడుదల చేసే విధంగా చిత్ర బృందం ఆలోచిస్తున్నట్టు సమాచారం.

Also Read: Realme 12 Pro+: అద‌ర‌హో అనిపిస్తున్న‌ రియ‌ల్‌మీ 12 ప్రో+ స్పెసిఫికేషన్స్‌.. ఇంత‌కీ లాంచ్ ఎప్పుడంటే?

ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబినేషన్లో వస్తున్న కల్కి 2898AD సినిమా భారీ బడ్జెట్ సినిమా ఈ సినిమా సైన్స్ ఫిక్షన్ ఫిలిం కావడంతో వాస్తవానికి ఏ సినిమా ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేయాలి కానీ.. అది కుదరలేదు మే 9వ తేదీన పోస్ట్ పోన్ చేయబోతున్నట్లు ప్రకటించారు.. అయితే ఈ సినిమాకి కూడా VFX పనుల వల్లే ఆలస్యం అవుతున్నట్లు సమాచారం.

Reason Behind Tollywood Pan India Films Getting Postponement

సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్లో వచ్చిన పుష్ప సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమా సీక్వెల్ పుష్ప-2 షూటింగ్ కొనసాగుతూనే ఉన్నది. అందుకే ఈ సినిమా పైన భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. ఆలస్యంగా షూటింగ్ ప్రారంభించినప్పటికీ మధ్య మధ్యలో కొన్ని కారణాల చేత ఈ సినిమా షూటింగ్ ఆగుతూనే వస్తోంది. వాస్తవానికి ఈ సినిమాని ఆగస్టు 15న విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించారు ఇప్పుడు ఈ సినిమా కూడా వాయిదా పడేలా కనిపిస్తోందట.. ముఖ్యంగా ఇందులోని యాక్టర్ జగదీష్ అరెస్ట్ కావడంతోపాటు..VFX పనులవల్లే ఆలస్యం అవుతున్నట్లు సమాచారం. మొత్తానికి ఈ పాన్ ఇండియా సినిమాలలో విఎఫ్ఎక్స్ పనుల వల్ల ఆలస్యం అవుతున్నట్లు కనిపిస్తోంది. (Tollywood)

Join WhatsApp