Regina Cassandra who is going to get married

Regina Cassandra : తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో నటిగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రెజీనా కసాండ్రా త్వరలోనే పెళ్లి చేసుకోబోతుందట. అయితే గత కొద్దిరోజులుగా రెజినా పెళ్లి వార్తలు చక్కర్లు కొడుతున్నప్పటికీ ఈ న్యూస్ పై క్లారిటీ ఇవ్వడం లేదు.ఇక రెజీనా త్వరలోనే ఓ వ్యాపారవేత్తను పెళ్లి చేసుకోబోతున్నట్లు సమాచారం.అయితే తాజాగా పెళ్లికి సంబంధించిన ఒక పోస్టు రెజీనా పెట్టడంతో ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

Regina Cassandra who is going to get married

మరి ఇంతకీ రెజినా పెళ్లి చేసుకోబోయేది నిజమేనా.. సోషల్ మీడియా లో ఎలాంటి పోస్ట్ పెట్టింది అనే సంగతి ఇప్పుడు తెలుసుకుందాం. సుధీర్ బాబు హీరోగా చేసిన శివ మనసులో శృతి అనే సినిమా ద్వారా తెలుగు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది రెజినా.ఆ తర్వాత సందీప్ కిషన్ తో రొటీన్ లవ్ స్టోరీ,అల్లు శిరీష్ తో కొత్తజంట వంటి సినిమాల ద్వారా తెలుగులో హీరోయిన్గా గుర్తింపు సంపాదించింది. పిల్లా నువ్వు లేని జీవితం, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, పవర్,రారా కృష్ణయ్య, సౌఖ్యం,షాకిని డాకిని వంటి సినిమాల్లో చేసింది.(Regina Cassandra )

Also Read: Sandeep Reddy Vanga: యానిమ‌ల్ స‌క్సెస్‌తో రెమ్యున‌రేష‌న్ భారీగా పెంచేసిన సందీప్ రెడ్డి వంగా.. ఏకంగా అన్ని కోట్లా..?

అలాగే చిరంజీవి హీరో గా చేసిన ఆచార్య సినిమాలో స్పెషల్ సాంగ్ లో కూడా రెజీనా కనిపించింది. అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ హీరోయిన్ కి సినిమాల్లో అంతగా అవకాశాలు రాకపోవడంతో వైవాహిక బంధం లోకి అడుగు పెట్టాలని చూస్తుందట. ఇందులో భాగంగానే ఈమె పెళ్ళంటూ టాలీవుడ్, కోలీవుడ్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

Regina Cassandra who is going to get married

అయితే తాజాగా తన పెళ్లికి సంబంధించిన హింట్ ఇచ్చేసింది రెజీనా కసాండ్రా. తన సోషల్ మీడియా ఖాతాలో పోలింగ్ ఫర్ ఎంగేజ్మెంట్ బేసికల్లి అనే ట్యాగ్ పెట్టి తనకి సంబంధించిన కొన్ని ఫోటోలు షేర్ చేసింది. ఇక రెజీనా పోస్ట్ నెట్టింట్లో వైరల్ అవ్వడంతో చాలామంది ఈమె అభిమానులు ఆమె పెళ్లి చేసుకోబోతుంది కావచ్చు అందుకే తన అభిమానులకు ఈ విధంగా హింట్ ఇచ్చింది అంటూ కామెంట్లు పెడుతున్నారు. మరి చూడాలి రెజినా పెళ్లి చేసుకోబోయే అబ్బాయి ఎవరో.(Regina Cassandra )

Join WhatsApp