remuneration Katrina Kaif took for the movie Malleshwari

Katrina Kaif: నటి కత్రినా కైఫ్ మనందరికీ సుపరిచితమే. ఈమె పేరుకు బాలీవుడ్ నటి అయినప్పటికీ తెలుగు ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ని సంపాదించుకుంది. మల్లేశ్వరి మూవీ తో ఓవర్ నైట్ లో స్టార్ అయిపోయింది కత్రినా కైఫ్. ఇక ఇదిలా ఉంటే నటి సంగతుల్ని విజయభాస్కర్ తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

remuneration Katrina Kaif took for the movie Malleshwari

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మల్లేశ్వరి సినిమాకు హీరోయిన్ను వెతికి బాగానే అలసిపోయానని.. చివరకు ఓ యాడ్ లో కత్రినా ని చూసి ఓకే చెప్పానని.. సురేష్ బాబుకి చెబితే ఎలాగోలా కత్రినా కైఫ్ ను పట్టుకున్నాడని.. వెల్లడించారు. కానీ ఆమె ఎక్స్ప్రెషన్స్ అండ్ డాన్స్ మూమెంట్స్ కూడా సరిగ్గా లేవని అంతా అనుకున్నారట. కానీ ఆ ప్రిన్సెస్ పాత్రకి కత్రినా కరెక్ట్ గా సెట్ అవుతుందని ముందే ఫిక్స్ అయ్యి ఉన్నాడట విజయ్ భాస్కర్.

Also Read: Nayanthara: మరోసారి బరిలోకి దిగిన నయనతార.. ఇక ఆపడం కష్టమేగా..!

ఆమె అయితేనే బాగుంటుందని పట్టుపట్టాడట. ఇక కత్రినా కైఫ్ కు అప్పట్లోనే మల్లేశ్వరి సినిమాలో నటించడానికి గాను 70 లక్షలు ఇచ్చారని.. ఆమె స్టాఫ్ రాకపోకలకు మరో 25 లక్షలు అయ్యి ఉంటుందని.. అప్పట్లోనే దాదాపు కోటి ఇచ్చామని.. కోటి అంటే మామూలు విషయం కాదని విజయ్ భాస్కర్ చెప్పుకొచ్చాడు. అదేవిధంగా కత్రినాక ఎక్కువ అప్పట్లో డాన్స్ సరిగా రాదు కానీ ఇప్పుడు ఆమె ఎంతలా ఎదిగిందో అందరికీ తెలిసిందే.

remuneration Katrina Kaif took for the movie Malleshwari

నేర్చుకోవాలన్న ఇంట్రెస్ట్ అండ్ తపన ఉంటే ఏదైనా సాధ్యం అవుతుందని కత్రినా కైఫ్ మళ్లీ ప్రూవ్ చేసిందని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి. నిజానికి కత్రినా కైఫ్ అంటే ఆ తరానికే కాదు ఈ తరానికి కూడా ఇన్స్పిరేషన్ గా నిలిచింది. తాను చేసే సినిమాలతో ప్రతి ఒక్కరిని అలరించింది. ప్రస్తుతం ఈమె సినీ ఇండస్ట్రీలో తన జోరును తగ్గించింది.(Katrina Kaif)

Join WhatsApp