Renu Desai Second Marraige

Renu Desai: పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ నిజంగానే పెళ్లి చేసుకోబోతోందా.. తల్లిని అకీరా నందన్ నిజంగానే పెళ్లి చేసుకోమని చెప్పారా.. అనే నమ్మలేని నిజాలు ఇప్పుడు తెలుసుకుందాం.పవన్ కళ్యాణ్ రెండో భార్య రేణు దేశాయ్ అందరికీ తెలిసిన అమ్మాయే. ఎందుకంటే ఈమె సినిమా ఇండస్ట్రీకి చెందిన అమ్మాయి కావడంతో అందరికీ తెలుసు.. అయితే ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట ఇద్దరు పిల్లలు పుట్టాక విడాకులు తీసుకున్నారు.

Renu Desai Second Marraige

ఇక విడాకుల తర్వాత పవన్ మూడో పెళ్లి చేసుకోగా రేణుదేశాయ్ మాత్రం ఒంటరిగానే ఉంటుంది.అయితే అప్పట్లో రేణుదేశాయ్ రెండో పెళ్లి చేసుకోబోతుంది అంటూ వార్తలు నెట్టింట చక్కర్లు కొట్టాయి. అంతేకాదు ఆమెకు సంబంధించిన ఎంగేజ్మెంట్ ఫొటోస్ కూడా మీడియా లో కనిపించేసరికి ఇవి నిజమే కావచ్చు అనుకున్నారు.అయితే గతంలో రేణు దేశాయ్ రెండో పెళ్లి గురించి స్పందిస్తూ.. నేను పవన్ తో విడిపోయాక రెండో పెళ్లి చేసుకోవాలి అనుకున్నాను. నా పిల్లలు కూడా అందుకు ఓకే చెప్పారు. (Renu Desai)

Also Read: Tollywood: తెలుగు తెర‌పై అస్స‌లు సెట్ అవ్వ‌ని హీరో-హీరోయిన్ల వ‌ర‌స్ట్‌ కాంబినేషన్స్‌ ఇవే..!

అంతేకాదు నా కొడుకు అయితే నాన్న రెండో పెళ్లి చేసుకున్నప్పుడు నువ్వెందుకు ఒంటరిగా ఉంటావమ్మ నువ్వు కూడా పెళ్లి చేసుకో అని చెప్పాడు.ఇక నా పేరెంట్స్ కూడా సంబంధాలు చూశారు. ఓ వ్యక్తితో కొద్దిరోజులు మాట్లాడాను కానీ సెట్ అవ్వలేదు. ఇక నా కొడుకు అకిరా నందన్ రెండో పెళ్లి చేసుకో అమ్మ అని చెప్పిన సమయంలో చూద్దాం నాన్న మంచి వ్యక్తి దొరికినప్పుడు ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటాను అంటూ చెప్పానని అప్పట్లో ఓ ఇంటర్వ్యూలో రేణు దేశాయ్ చెప్పింది.

Renu Desai Second Marraige

అంతే కాదు నేను రెండో పెళ్లి చేసుకోవాలని అనుకుంటే పవన్ కళ్యాణ్ అభిమానులు నువ్వు వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుంటే బాగుండదని బెదిరిస్తున్నారని చెప్పింది. పవన్ కళ్యాణ్ చేసుకుంటే తప్పు కాదు కానీ నేను చేసుకుంటే తప్పని బెదిరిస్తున్నారు. ఇక అప్పట్లో రేణు దేశాయ్ తన రెండో పెళ్లి గురించి మాట్లాడిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది. అయితే పవన్ రేణుదేశాయ్ లకు పుట్టిన పిల్లలు ప్రస్తుతం పెద్దవ్వడంతో రేణుదేశాయ్ త్వరలోనే రెండో పెళ్లి చేసుకోబోతున్నట్టు తెలుస్తోంది.(Renu Desai)

Join WhatsApp