Rs. Ram Charan who donated a watch worth 2 crores

Ram Charan: మెగా స్టార్ చిరంజీవి వారసత్వాన్ని అందిపుచ్చుకుంటూ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అనంతరం తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న హీరో రామ్ చరణ్. త్రిబుల్ ఆర్ సినిమాతో ఓవర్ నైట్ లో పాన్ ఇండియా స్టార్ అయిపోయిన చెర్రీ ప్రస్తుతం గేమ్ చేంజర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తున్న ఈ మూవీపై చరణ్ అభిమానులతో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమా నుంచి ఇప్పటికే ఓ సాంగ్ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సాంగ్ ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది కూడా.

Rs. Ram Charan who donated a watch worth 2 crores

ఇక ఇదిలా ఉంటే చరణ్ గొప్ప మనసు గురించి మనందరికీ తెలిసిందే. తాజాగా మంచు మనోజ్ కూడా ఈ విషయాలని బయటపెట్టాడు. తన దగ్గరికి వచ్చిన ఒక ఫ్యామిలీకి డబ్బు సాయం చేయమని అడిగితే స్పాట్లో మనీని ట్రాన్స్ఫర్ చేశాడంటూ గొప్ప మనసును చాటి చెప్పాడు మనోజ్. ఇక తాజా చరణ్ తన మనసును మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు. డబ్బు పలుకుబడి ఉంటే గొప్ప మనసు రాదు.. ఇచ్చే గుణం ఉంటేనే ఆయన హీరో అవుతాడని మరోసారి ప్రూవ్ చేశాడు చెర్రీ.

Also Read: Anushka Shetty: అనుష్క దిగజారిపోయి చేసిన ఆ రెండు పనులు కారణంగానే తన కెరీర్ స్పాయిల్ అయిందా..?

తాను చాలా ఇష్టంగా కొనుగోలు చేసిన వాచ్ ని సింపుల్ గా ఓ పిల్లవాడికి ఇచ్చేసాడు చెర్రీ. ఎందుకు ఇచ్చాడు? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. వర‌స‌ సినిమాలతో బిజీ లైఫ్ ను గడుపుతున్న చరణ్ అప్పుడప్పుడు అనాధ ఆశ్రమాలకి వెళుతూ అక్కడ ఉన్న పిల్లలని కూడా చూస్తూ ఉంటాడు. ఈ క్రమంలోనే.. రామ్ చరణ్ బర్తడే రోజు చిరంజీవి మరియు సురేఖ తో కలిసి చరన్ అనాధ ఆశ్రమంలోకి ఫుడ్ను డొనేట్ చేసేందుకు వెళ్లాడు. ఇక అక్కడున్న ఓ చిన్న పిల్లవాడు.. మీ వాచ్ నాకు చాలా బాగా నచ్చింది.

Rs. Ram Charan who donated a watch worth 2 crores

నాకు ఆ వాచ్ ఇస్తారా? అని రామ్ చరణ్ ని అడిగాడు. ఇక రామ్ చరణ్ దానిని సీరియస్గా తీసుకుని ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఆ పిల్లవాడికి వాచ్ ఇచ్చేసాడట. ఇక ఇది చూసి చిరంజీవి చాలా షాక్ అయ్యాడట. ఎందుకంటే రామ్ చరణ్ ఆ వాచ్ ని ఎంతో ఇష్టంగా కొనుగోలు చేశాడట. ఏకంగా రెండు కోట్ల పెట్టి ఈ వాచ్ ని కొనుగోలు చేసిన చెర్రీ ఒక పిల్లవాడి ఆనందం కోసం తన వాచ్ ను త్యాగం చేసి తన గొప్ప మనసును మరోసారి చాటుకున్నాడు. ప్రస్తుతం ఇదే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వార్త చూసిన పలువురు.. మంచి వాళ్ళ కడుపున మరో మంచి వాళ్లే పుడతారు అన్న పదానికి అర్థం చెప్పారు.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు.(Ram Charan)

Join WhatsApp