S.V. Krishna Reddy comments viral

S.V. Krishna Reddy: డైరెక్టర్ ఎస్వి కృష్ణారెడ్డి అంటే ఇప్పటి జనరేషన్ కి కూడా తెలిసిన దర్శకుడు.. ఈయన తన దర్శకత్వ ప్రతిభ తో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలను తెలుగు ఇండస్ట్రీ జనాలకు కళ్లకు కట్టినట్టు చూపించారు.. గతంలో ఈయన దర్శకత్వంలో బ్లాక్బస్టర్ మూవీలైన శుభలగ్నం, ఆహ్వానం, యమలీల, మావిచిగురు,ఎగిరే పావురమా, బడ్జెట్ పద్మనాభం, అభిషేకం,ఊయల వంటి ఎన్నో హిట్ సినిమాలు వచ్చాయి. అయితే తాజాగా ఈ డైరెక్టర్ మహేష్ బాబు పై చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.

S.V. Krishna Reddy comments viral

ఎస్వి కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. ఎప్పుడు గానీ నేను సినిమా కథనే నమ్ముకుంటాను హీరోను నమ్ముకోను. ఒకవేళ హీరోని నమ్ముకుంటే ఎలాంటి ఫలితం ఉంటుందో నాకు తెలుసు. ఎందుకంటే నేను కథను నమ్ముకున్నాను కాబట్టే శుభలగ్నం, మావిచిగురు, యమలీల వంటి బ్లాక్ బస్టర్ సినిమాలు తీశాను. కానీ బాలకృష్ణను నమ్ముకొని వజ్రం సినిమా తీయడం కారణంగా ఆయన ఇమేజ్ కి తగ్గట్టు సినిమా తీయాలనే ఉద్దేశంతో కథను ఆయనకు తగ్గట్టుగా మార్చడంతో ఈ సినిమా ప్లాఫ్ అయింది.(S.V. Krishna Reddy)

Also Read: Trisha: 18 ఏళ్ల త‌ర్వాత మ‌ళ్లీ మెగాస్టార్ తో జ‌త‌క‌డుతున్న త్రిష.. హాట్ టాపిక్‌గా రెమ్యున‌రేష‌న్‌!

స్టార్ హీరో సినిమా కాస్త ఫ్లాఫ్ గా మారింది.అందుకే నేను హీరోను అస్సలు నమ్ముకోను. ఇక ఈ మధ్యనే స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ గుంటూరు కారం సినిమా తీసిన సంగతి తెలిసిందే. కానీ ఈ మూవీ అట్టర్ ప్లాఫ్ అయ్యింది. ఎందుకంటే ఈయన మహేష్ బాబు ఇమేజ్ కి మ్యాచ్ అయ్యేలా సినిమా తీయాలి అనుకున్నారు.అందుకే పాపం ఆ సినిమా ప్లాఫ్ అయ్యింది. ఒకవేళ ఆయన కథను నమ్ముకుని తీసి ఉంటే బ్లాక్ బస్టర్ హిట్ అయ్యేది.

S.V. Krishna Reddy comments viral

అందుకే ఎప్పుడూ కూడా హీరోలను నమ్ముకోకూడదు.మన కథలను నమ్ముకోవాలి. నేను యమలీల వంటి సినిమా కోసం కథను మాత్రమే నమ్ముకున్నాను. హీరో విషయం అస్సలు పట్టించుకోలేదు.ఇక ఆ సినిమా రిజల్ట్ ఎలా ఉందో చెప్పనక్కర్లేదు అంటూ తాజా ఇంటర్వ్యూలో ఎస్ వి కృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.(S.V. Krishna Reddy)

Join WhatsApp