Saarika Love Story

Saarika : కమల్ హాసన్ మాజీ భార్య సారిక నిజంగానే కమల్ హాసన్ కంటే ముందే మరొక వ్యక్తిని ప్రేమించిందా.. మరి ఎందుకు అతనితో పెళ్లిదాకా వచ్చి చెడిపోయింది అనే నమ్మలేని నిజాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.. క్రికెటర్లకు సినిమా ఇండస్ట్రీకి విడదీయలేని బంధం ఉంటుంది. చాలామంది క్రికెటర్లు హీరోయిన్లను పెళ్లి చేసుకున్న వాళ్ళు ఉన్నారు.అయితే అప్పట్లో క్రికెటర్స్ కి హీరోయిన్స్ కి మధ్య విడదీయలేని బంధం ఉండేది. ఇక ఇప్పటికి కూడా బంధం అలాగే కొనసాగుతోంది.

Saarika Love Story

అయితే కమలహాసన్ మాజీ భార్య సారిక అప్పట్లో స్టార్ క్రికెటర్ అయినటువంటి కపిల్ దేవ్ ని చాలా ప్రాణంగా ప్రేమించిందట. ఇక కపిల్ దేవ్ కూడా సారికను ఓ ఫంక్షన్ లో చూసినప్పుడే ప్రేమలో పడడంతో వీళ్ళిద్దరి మధ్య బంధం ఏర్పడి వెళ్లి చేసుకునే వరకు వెళ్లారట. అయితే సారికని కపిల్ తల్లిదండ్రులకు పరిచయం చేసి పెళ్లి చేసుకోవాలని ఓరోజు సారికను తన ఇంటికి తీసుకు వెళ్లారట.కానీ అక్కడే అసలు ట్విస్ట్ ఉంది.అదేంటంటే కపిల్ దేవ్ సారీకతో ప్రేమలో పడడం కంటే ముందే రోమీ అనే అమ్మాయితో చూడగానే ప్రేమలో పడిపోయారట.(Saarika )

Also Read: Ileana D’Cruz: భ‌ర్త గురించి ఫ‌స్ట్ టైమ్ నోరు విప్పిన ఇలియానా.. ఏమ‌న్నా అంటే త‌ట్టుకోలేనంటూ కామెంట్స్‌!

అయితే సారిక కపిల్ దేవ్ మధ్య ఏదో జరుగుతుంది అనే విషయం ప్రముఖ వార్తా పత్రికల్లో రావడంతో ఈ విషయం అంతా తెలిసిన రోమి, కపిల్ దేవ్ ని వదిలేసిందట. కానీ చివరికి కపిల్ దేవ్ సారీకని పెళ్లి చేసుకోబోతున్నాడు అనే వార్త తెలియగానే రోమీ ఉండబట్ట లేక తిరిగి కపిల్ దేవ్ దగ్గరికి వచ్చేసిందట.ఇక ఆ క్షణంలో కపిల్ దేవ్ మనసు రోమి వైపే లాగిందట. దాంతో మొదట ప్రేమించిన రోమీనే పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యి సారికకు బ్రేకప్ చెప్పారట.

Saarika Love Story

దాంతో ఈ మ్యాటర్ కాస్త అప్పటి వార్తాపత్రికల్లో హాట్ టాపిక్ గా మారింది. అంతే కాదు సారిక ఆ డిప్రెషన్లో ఉండి కోలుకోవడానికి చాలా రోజులే పట్టిందట. కానీ అదే సమయంలో సారికకు హీరో కమల్ హాసన్ పరిచయమయ్యాడు.ఇక ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. అయితే అప్పటికే కమల్ హాసన్ కి పెళ్లి అయినా కూడా సారిక రెండో పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంది. అలా ఆయన్ని పెళ్లి చేసుకొని ఇద్దరు బిడ్డలకు జన్మనిచ్చింది.(Saarika )

Join WhatsApp