Sada wedding in August

Sada: ఈ మధ్యకాలంలో చాలామంది హీరోయిన్లు వయసు మీద పడుతుండడంతో పెళ్లిళ్లు చేసుకుంటున్నారు.. ఇక మరికొంతమందేమో సినిమాల్లో వరుస అవకాశాలు ఉండి బిజీగా ఉండడం కారణంగా పెళ్లి అనే విషయాన్ని పోస్ట్ పోన్ చేసుకుంటున్నారు. కానీ చాలామంది హీరోయిన్స్ మాత్రం ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరిగితేనే బాగుంటుంది అనే కారణంతో పెళ్లిళ్లు అయి పిల్లలు పుట్టాక కూడా మళ్లీ ఇండస్ట్రీలో రాణిస్తున్నారు.

Sada wedding in August

అయితే తాజాగా సౌత్ హీరోయిన్ అయిన సదా కూడా పెళ్లికి రెడీ అయిపోయినట్టు ఇండస్ట్రీలో ఓ టాక్ వినిపిస్తోంది. అయితే ఇప్పటికే 40 ఏళ్లు దాటిన సదా పెళ్లి చేసుకోవడం లేదు. ఇక ఈమె పెళ్లి చేసుకోక పోవడానికి కారణం కూడా లేకపోలేదు. సినిమాల్లో హీరోయిన్గా నటించిన సమయంలో సదా ఓ కోలీవుడ్ హీరో తో ప్రేమలో పడిందట. అయితే ఆ హీరో తో పెళ్లి వరకు వెళ్లిందట కానీ ఎందుకో మధ్యలోనే బ్రేకప్ అయిందట.అయితే దానికి ఇంకో కారణం ఏంటంటే..(Sada)

Also Read: Trisha: ఆ హీరో ని ప్రేమ పేరుతో మోసం చేసిన త్రిష..!

ఆ హీరోకి అప్పటికే పెళ్ళై పిల్లలు ఉండడంతో మొదటి భార్య సదా విషయంలో రచ్చరచ్చ చేయడంతో పరువు పోతుంది అనే ఉద్దేశంతో ఆ హీరో కుటుంబ సభ్యులు సదాని వదిలిపెట్టమని వార్నింగ్ ఇచ్చారట. అలా కుటుంబం కోసం మొదటి భార్య కోసం సదా కి ఆ హీరో బ్రేకప్ చెప్పారట. ఇక అప్పటినుండి ఇప్పటి వరకు ఆమె అబ్బాయిలు అంటేనే మోసం చేసేవాళ్లని,జీవితంలో పెళ్లి చేసుకోకూడదు అని అనుకుందట.కానీ ఇంట్లో వాళ్ళ ఒత్తిడి కారణంగా పెళ్లికి ఓకే చెప్పిందట.

Sada wedding in August

అయితే రీసెంట్గా మనసుకు నచ్చిన వాడు దొరికితే ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటాను అని చెప్పింది సదా. అయితే తాజాగా ఇండస్ట్రీ నుండి వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. ఈ ముద్దుగుమ్మ తమిళనాడుకు చెందిన ఓ బిజినెస్ మ్యాన్ ని పెళ్లాడబోతుందట. అయితే ప్రస్తుతం మంచి రోజులు లేవు గనుక ఆగస్టులో ప్రైవేట్ ఫంక్షన్ లాగా కొద్ది మంది సమక్షంలో ఎంగేజ్మెంట్ చేసుకొని, అదే నెలలో గ్రాండ్గా పెళ్లి చేసుకోవాలని సదా నిర్ణయించుకుందట.మరి సదా పెళ్లి వార్తల్లో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ఈ వార్త విన్న అభిమానులంతా ఇది నిజమైతే బాగుండు అని భావిస్తున్నారు.(Sada)

Join WhatsApp