Sai Pallavi Reveals Her Best Friends In Tollywood

Sai Pallavi: న్యాచుర‌ల్ బ్యూటీ సాయి ప‌ల్ల‌వికి ఉన్న క్రేజ్ మ‌రియు ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. 2015లో వ‌చ్చిన మ‌ల‌యాళ చిత్రం ప్రేమ‌మ్ ద్వారా పాపుల‌ర్ అయిన సాయి ప‌ల్ల‌వి.. ఫిదా మూవీతో తెలుగు ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టింది. తొలి చిత్రంతోనే ఇక్క‌డ స్టార్ ఇమేజ్ సంపాదించుకుంది. ఫిదా త‌ర్వాత సాయి ప‌ల్ల‌వి వెన‌క్కి తిరిగి చూసుకోలేదు. తెలుగుతో పాటు త‌మిళ్, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ సౌత్ లో ఉన్న అగ్ర తారాల్లో ఒక‌రిగా గుర్తింపు తెచ్చుకుంది.

Sai Pallavi Reveals Her Best Friends In Tollywood

కెరీర్ ఆరంభం నుంచి కేవ‌లం ప్రాధాన్య‌త ఉన్న పాత్ర‌ల‌తోనే ప్రేక్ష‌కుల‌ను అలరిస్తూ వ‌స్తోంది. ఆన్ స్క్రీన్ లోనే ఆఫ్ స్క్రీన్ లోనూ ఎంతో ప‌ద్ధ‌తిగా క‌నిపిస్తూ కోట్లాది సినీ ప్రియుల హృద‌యాల్లో చోటు ద‌క్కించుకుంది. ఈ సంగ‌తి ప‌క్క‌న పెడితే.. సెల‌బ్రిటీలు షూటింగ్స్ లేక‌పోతే ఫ్రెండ్స్, పార్టీస్ అంటూ ఫుల్ గా ఎంజాయ్ చేస్తుంటారు. కానీ సాయి ప‌ల్ల‌వి మాత్రం అందుకు పూర్తిగా భిన్నం. షూటింగ్స్ లేక‌పోతే సాయి పల్ల‌వికి త‌న ఫ్యామిలీనే ప్ర‌పంచం అయిపోతుంది.

త‌ల్లిదండ్రులు, చెల్లెలుతో ఫుల్‌గా టైమ్ స్పెండ్ చేస్తుంది. అలా అని సాయి ప‌ల్ల‌వి ఫ్రెండ్స్ ఎవ‌రూ లేర‌నుకుంటే పొర‌పాటే. ముఖ్యంగా మ‌న టాలీవుడ్ లో సాయి ప‌ల్ల‌వికి ముగ్గురు బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు. వారు మ‌రెవ‌రో కాదు నాగ‌చైత‌న్య‌, రానా ద‌గ్గుబాటి మ‌రియు డైరెక్ట‌ర్ శేఖ‌ర్ క‌మ్ముల‌. ఈ ముగ్గురే తెలుగు ఇండ‌స్ట్రీలో త‌న బెస్ట్ ఫ్రెండ్స్ అని.. ఏ కష్టం వచ్చినా వారు తన వెన్నెంటే ఉంటారని గ‌తంలో సాయి ప‌ల్ల‌వి ఓ ఇంట‌ర్వ్యూలో తెలిపింది.(Sai Pallavi)

Also Read: Samantha: నాగ‌చైత‌న్యకు స‌మంత క్షమాపణ.. ఎట్ట‌కేల‌కు బ‌య‌ట‌ప‌డ్డ విడాకుల ర‌హ‌స్యం!

రానా, నాగ చైత‌న్య‌, శేఖ‌ర్ క‌మ్ముల త‌న‌కు స్నేహితులు అని చెప్ప‌డం కంటే ఫ్యామిలీ మెంబ‌ర్స్ అని చెప్ప‌డ‌మే క‌రెక్ట్ అని సాయి ప‌ల్ల‌వి పేర్కొంది. కాగా, ప్ర‌స్తుతం సాయి ప‌ల్ల‌వి చేతిలో మూడు క్రేజీ ప్రాజెక్ట్స్ లో ఉన్నాయి. అందులో తండేల్ ఒక‌టి. ఇందులో నాగ‌చైత‌న్య‌, సాయి ప‌ల్ల‌వి జంట‌గా న‌టిస్తున్నారు. మత్యకారుల జీవితాల నేపథ్యంలో వాస్తవ ఘటనల ఆధారంగా చందూ మొండేటి ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. అలాగే త‌మిళంలో శివ కార్తికేయ‌న్ తో క‌లిసి అమరన్ అనే మూవీలో సాయి ప‌ల్ల‌వి న‌టిస్తోంది. ఇక బాలీవుడ్ లో జునైద్ ఖాన్ తో కలిసి ఈ మూవీ చేస్తోంది.

Join WhatsApp