Saindhav: Venkatesh & Shradha Srinath Age Gap Creates Buzz

Saindhav: వెంకటేష్ హీరోగా నటించిన తాజా సినిమా సైంధవ్ సంక్రాంతి కి థియేటర్ లలో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా వెంకటేష్ 75 వ సినిమాగా రాగా మొదటినుంచి మంచి విజయాన్ని అందుకుంటుందని భావించారు. అయితే నాలుగు సినిమాల పోటీ లో ఈ చిత్రం పెద్దగా మెప్పించలేకపోయింది. అయితే కంటెంట్ ను ప్రేక్షకులు మెచ్చరు. ఇకపోతే ఈ సినిమా ఓటీటీ లోకి ఎప్పుడెప్పుడు వస్తుందా అని అందరూ ఎదురుచూశారు.

Saindhav Movie OTT Release Date

అయితే తాజాగా ఈ అప్డేట్ గురించి వచ్చిన ఓ న్యూస్ అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. పెద్ద సినిమాలు నెలరోజుల తర్వాత ఓటీటీలోకి రావడం మనం ఇప్పటివరకు చూస్తున్నాం. అయితే సైంధవ్ సినిమా మాత్రం పదిహేను రోజుల్లోనే ఓటీటీలోకి రావడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఏదేమైనా ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సైంధవ్ సినిమా ఓటీటీ రిలీజ్ మాత్రం ఫిబ్రవరి 3 న అమెజాన్ ప్రైమ్ లో విడుదల కాబోతుంది. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన నేడు వచ్చింది.

Also Read: Revanth Reddy: రేవంత్ ఆటలో కోదండరాం బలి అయ్యాడా.. ముందే తెలిసి ఇలా చేశాడా

యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమా లో శ్రద్ధ శ్రీనాధ్ హీరోయిన్ గా నటించగా క్రైమ్ సినిమాలను తెరకెక్కించడంలో ఆరితేరిపోయిన దర్శకుడు శైలేష్ కొలను చాలా తక్కు సమయంలో ఈ సినిమా ను రూపొందించాడు. బాక్స్ ఆఫీస్ వద్ద చాలా మందిని అలరించిన ఈ సినిమా ఓటీటీ లో ఈమేరకు రాణిస్తుందో చూడాలి.

Join WhatsApp