Salaar Movie Fan Comments

Salaar: రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించిన ప్రభాస్ ఎంతో మంది అభిమానులని సంపాదించుకున్నాడు. ఇక ఇటీవలే ” సలార్ ” సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు.

Salaar Movie Fan Comments

ఇక ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ మూవీ రెండు భాగాలుగా విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక సలార్ మూవీలో ప్రభాస్ లుక్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తన మాస్ లుక్స్ తో ఒక్కొక్కడిని ఊచ కోత కోసాడని చెప్పొచ్చు. ఇక ఈ సినిమాలో సలార్ ఎంట్రీ అప్పుడు ఓ బీజీఎం వినపడుతుంది.

Also Read: Raja Chembolu: వాట్.. రాజా చెంబోలు ఆ స్టార్ డైరెక్టర్ కి అల్లుడు అవుతాడా… బయటపడ్డ సీక్రెట్..!

కానీ ప్రభాస్ ఎంట్రీ కి ఆ బీజీఎం కి అస్సలు సెట్ అవ్వలేదని ఫాన్స్ ఓ విధంగా విరుచుకుపడ్డ సంగతి తెలిసిందే. ఇక ప్రభాస్ ఎంట్రీకి రవి బస్సులూర్ సంగీతాన్ని తీసేసి డిఎస్పి సంగీతాన్ని యాడ్ చేశారు డార్లింగ్ ఫ్యాన్స్. ఇక నిజంగా ఈ బీజీఎంని చూస్తుంటే అచ్చం సినిమాలో రియల్ బీజిఎం పెట్టినట్లు అనిపిస్తుంది.

Salaar Movie Fan Comments

అంతేకాకుండా ఈ బీజీఎంని వింటుంటే ఒక్కొక్కడికి గూస్బంస్ వస్తున్నాయి. అంత అద్భుతంగా క్రియేట్ చేశారు. ఇక ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఈ క్రమంలోనే..” అసలు బీజిఎం దీని ముందు ఏ మాత్రం సరిపోదు. ఎంతైనా డీఎస్పీ అంటే ఓ రేంజ్ ” అంటూ కామెంట్స్ చేస్తున్నారు.(Salaar)

Join WhatsApp