Salar Movie Heroine Dialog

Salar: సాధారణంగా ఒక్క మన టాలీవుడ్ ఇండస్ట్రీ అనే కాకుండా ఏ ఇండస్ట్రీలో అయినా ఆ సినిమాలో నటించిన హీరో మరియు హీరోయిన్, యాక్ట్రెస్ మాత్రమే అందరికీ కనిపిస్తారు. కానీ ఆ సినిమా కోసం ఎంతో కృషి చేసే టెక్నీషియన్స్, కెమెరామెన్ ఎవ్వరికి కనిపించరు. అలానే డబ్బింగ్ చెప్పే వారు కూడా ఎవ్వరికీ తెలియదు. ఈ సినిమాకి నేను డబ్బింగ్ చెప్పాను అని వారికి వారు చెప్పుకుంటే నే కానీ ఎవ్వరికీ పెద్దగా తెలియదు.

Salar Movie Heroine Dialog

ఇక రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్‌ దర్శకత్వంలో శృతిహాసన్ హీరోయిన్గా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ” సలార్ “. భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన ఈ మూవీ మంచి రెస్పాన్స్ ని దక్కించుకుంది. ఇక ఈ సినిమాలోని ఓ డైలాగ్ ఓ అమ్మాయి చెప్పిన సంగతి తెలిసిందే. కాటేర్ అమ్మ అనే డైలాగ్ ని చెప్పి ప్రతి ఒక్కరికి గూస్బంస్ తెప్పించింది ఆ చిన్నారి. ఇక ఆమె పాత్రకి డబ్బింగ్ మాత్రం మరో అమ్మాయి చెప్పిందట. ఆమె మరెవ్వరో కాదు గృహలక్ష్మి సీరియల్ లో కస్తూరికి కూతురుగా నటించిన ముద్దుగుమ్మ.

Also Read: Lal Salam: లాల్ సలాం కి బిగ్ షాక్.. ఆ దేశంల్లో బ్యాన్..!

ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న పూజిత రెడ్డి సలార్ సినిమాపై కొన్ని వ్యాఖ్యలు చేసింది. ఈమె మాట్లాడుతూ..” సలార్లో కాటేరమ్మ అని డైలాగ్ ని నేనే చెప్పా. కానీ అది నేను చెప్పినట్లు పెద్దగా ఎవ్వరికీ తెలియదు ” అని చెప్పుకొచ్చింది. ఇక యాంకర్ మీకు ఈ ఆపర్చునిటీ ఎలా వచ్చింది అని ప్రశ్నించగా..” నేను నార్మల్ గా డబ్బింగ్స్‌ చెబుతూ ఉంటా. మీరు చూసుంటే లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాలో చిన్ని పాత్రకి కూడా నేనే డబ్బింగ్ చెప్పా.

Salar Movie Heroine Dialog

అలా గతం లో కూడా నేను డబ్బింగ్ చెప్పే దాన్ని. అలానే నాకు సలార్ మూవీ నుంచి కూడా కాల్ వచ్చింది. దగ్గరుండి ప్రశాంత్ నీల్ సార్ నాతో డబ్బింగ్ చెప్పించారు. ఆయన గైడ్ చేస్తుంటే చెప్పడం నాకు నిజంగా ఎంతో సంతోషం కలిగించింది. ఈ సినిమాల్లో అవకాశం దక్కినందుకు నేను ప్రౌడ్ గా ఫీల్ అవుతున్న ” అంటూ చెప్పుకొచ్చింది పూజ. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండింగ్ లో ఉన్నాయి. ఈమె వ్యాఖ్యలు చూసిన పలువురు..” నిజంగా నువ్వు ఈ డైలాగ్ చెప్పావంటే అసలు నమ్మశక్యం కింద లేదు. మీ బేస్ వాయిస్ తో బా చెప్పారు ” అంటూ కామెంట్స్ చేస్తున్నారు ప్రేక్షకులు.(Salar)

Join WhatsApp