Samantha- Anupama combination lady oriented movie fics

Samantha: సాధారణంగా ఒక సినిమాలో ఒక హీరోయిన్ కనిపిస్తేనే ఆ సినిమా సూపర్ హిట్ అంటూ ఉంటారు. అదే ఓకే సినిమాలో ఇద్దరు పాపులర్ హీరోయిన్స్ కనిపిస్తే ఆ సినిమాకి ఏ రేంజ్ హైబ్స్ ఉంటాయో మనందరం అర్థం చేసుకోవచ్చు. అలా ఇప్పటికే ఒక హీరో సరస్సున ఎంతోమంది ముద్దుగుమ్మలు ఆడి పాడారు. కానీ అది ఒక లెక్క అయితే లేడీ ఓరియంటెడ్ సినిమాలలో ఇద్దరు స్టార్ హీరోయిన్స్ కనిపించి మెప్పించడం మరొక ఎత్తు.

Samantha- Anupama combination lady oriented movie fics

హీరో సరస్సున ఒకరు ఫస్ట్ హీరోయిన్ గా ఇంకొకరు సెకండ్ హీరోయిన్ గా నటించడం కామన్. కానీ లేడీ ఓరియంటెడ్ సినిమాలో ఇద్దరు ముద్దుగుమ్మలు తలకి కట్టినట్లు కనిపిస్తే ప్రేక్షకులు ఎంతగానో కృషి అవుతారు. ఇక తాజాగా ఇటువంటిదే ఓ సినిమా రాబోతుంది. మరి ఆ సినిమాలో హీరోయిన్స్ ఎవరు అని ఆలోచిస్తున్నారా? వారు మరెవరో కాదు టాలీవుడ్ బ్యూటిఫుల్ హీరోయిన్స్ సమంత మరియు అనుపమ.

Also Read: Vithika Sheru: అమెరికాలో జరిగిన ఆ ఘటన కారణం గానే మేము పిల్లలని కనలేదు.‌.. ఎట్టకేలకు పిల్లల కనడం పై స్పందించిన వితిక..!

ఇటీవలే టిల్లు స్క్వేర్ సినిమాతో ట్రెండ్ సెట్ చేసిన ఈ బ్యూటీ తాజాగా ఓ లేడీ ఓరియంటెడ్ సినిమా చేసేందుకు సైన్ చేసింది. ఇక ఈ సినిమాలో మరో బ్యూటీ సమంత కూడా మనందరికీ పరిచయమే. ఇటీవలే మయోసైటీస్ వ్యాధి నుంచి కోరుకున్న సమంత ప్రస్తుతం మూవీలో నటిస్తుంది. ఇక ఈ మూవీ పై భారీ హైబ్స్ కూడా ఏర్పడ్డాయి. ఇక ఈ మూవీ అనంతరం సమంత మరియు అనుపమ కాంబినేషన్లో ఓ క్రేజీ మూవీ తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది.

Samantha- Anupama combination lady oriented movie fics

ఇక ఈ మూవీకి ఓ స్టార్ డైరెక్టర్ దర్శకత్వం వహించనున్నట్లు కొంతకాలంగా ప్రచారం జరుగుతుంది. కానీ దీనిపై ఇంకా అఫీషియల్ క్లారిటీ అయితే రాలేదు. గతంలో వీరిద్దరూ కలిసి నటించిన మూవీ.. అఆ ఎంత పెద్ద విజయం సాధించిందో మనందరికీ తెలిసిందే. నితిన్ హీరోగా నటించిన ఈ మూవీ అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇక వీరిద్దరి కాంబినేషన్ కి ఉన్న పాపులారిటీ చూసే ఓ డైరెక్టర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఇక దీనికి ఈ ఇద్దరూ కూడా ఓకే చెప్పినట్లు సమాచారం. ఇక ఈ మూవీ గురించి మరిన్ని విషయాలు తెలియాలంటే అఫీషియల్ అనౌన్స్మెంట్ చేయాల్సిందే.(Samantha)

Join WhatsApp