Samantha Says Sorry To Naga Chaitanya

Samantha: సౌత్ స్టార్ బ్యూటీ సమంత ప్రొఫెషనల్ లైఫ్ లో సూపర్ సక్సెస్ అయినప్పటికీ.. పర్సనల్ లైఫ్ లో మాత్రం చాలా స్ట్రగుల్స్ ను ఫేస్ చేసింది. వరుస సినిమాలతో కెరీర్ ఫామ్ లో ఉన్న సమయంలోనే సమంత నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకుంది. 2017లో వీరి వివాహం జరిగింది. టాలీవుడ్ లో మోస్ట్ క్యూట్ కపుల్ గా పేరు తెచ్చుకున్న నాగచైతన్య, సమంత తమ బంధాన్ని ఎక్కువ కాలం కొనసాగించలేకపోయారు. దాదాపు ఏడేళ్లు ప్రేమలో ఉన్న ఈ జంట పెళ్లి త‌ర్వాత‌ కనీసం నాలుగేళ్లు కూడా కలిసి ఉండలేకపోయారు.

Samantha Says Sorry To Naga Chaitanya

మనస్పర్ధలతో విడాకులు తీసుకుని ఎవరి దారి వారు చూసుకున్నారు. వీరి విడాకులకి అసలైన కారణం బయటకు రాలేదు. కానీ చాలామంది సమంతనే నిందించారు. ఆమెపై విమర్శలు దాడి చేశారు. అన్నిటిని ఎదురించి ఆమె నిలబడింది. కెరీర్ పై ఫోకస్ పెట్టింది. వరుస సినిమాలతో బిజీగా కొనసాగుతున్న సమయంలో మ‌యోసైటిస్ అనే అరుదైన వ్యాధి ఆమెకు త‌లెత్తింది. దాంతో గ‌త‌ ఏడాది నుంచి సమంత సినిమాలు ప‌క్క‌న పెట్టి ఆరోగ్యం పై దృష్టి పెట్టింది.

ఇకపోతే కెరీర్ ప్రారంభమై 14 ఏళ్లు గడిచిన సందర్భంగా స‌మంత తాజాగా ఇండియా టుడే కాన్ క్లేవ్ సదస్సులో పాల్గొంది. ఈ స‌ద‌స్సులో ఆమె ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకుంది. ఈ క్రమంలోనే తన విడాకుల రహస్యాన్ని పరోక్షంగా బయట పెట్టింది. కొంతకాలం క్రితం బాలీవుడ్ లో ది ఫ్యామిలీ మెన్ వెబ్ సిరీస్ లో సమంత రాజి అనే ఓ బోల్డ్ క్యారెక్టర్ లో నటించింది. కెరీర్‌లోనే తొలిసారి ఈ సిరీస్‌లో ఇంటిమేట్ సీన్స్ లో చెల‌రేగిపోయింది. ఒక నటిగా సమంత ఆ పాత్రకు వందకు వందశాతం న్యాయం చేసింది. కానీ రాజీ క్యారెక్టర్ వల్ల సౌత్ లో సమంత ఇమేజ్ డ్యామేజ్ అయింది. ఇక ఆ క్యారెక్టర్ చేయ‌డం వ‌ల్లే సమంత, నాగచైతన్య మ‌ధ్య మ‌న‌స్ప‌ర్థ‌లు త‌లెత్తి విడాకులు తీసుకున్నారని ఇండస్ట్రీలో ప్రచారం జరిగింది.(Samantha)

Also Read: Rajinikanth: ర‌జ‌నీకాంత్ పేరుతో భారీ మోసం.. గుడ్డిగా న‌మ్మి రూ. 4 ల‌క్ష‌లు పోగొట్టుకున్న యువ‌తి!

అయితే ఆ ప్రచారమే నిజం అనేలా తాజా సదస్సులో సమంత మాట్లాడింది. ఫ్యామిలీ మెన్ వెబ్ సిరీస్ కారణంగా ఎన్నో విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. రాజీ పాత్ర నా హోమ్ ను పాడు చేసింది. ఫ్యామిలీ మ్యాన్ లో నా పాత్ర వల్ల ఎవరైనా బాధపడితే క్ష‌మించండి అంటూ సమంత వ్యాఖ్యానించింది. దీంతో ఆమె వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి. ఇన్ని రోజుల తర్వాత రాజీ పాత్ర పోషించడం పట్ల సమంత సారీ చెప్పడంపై అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఆమె పరోక్షంగా నాగచైతన్యకే క్షమాపణ చెప్పిందని కూడా అభిప్రాయపడుతున్నారు.

Join WhatsApp