Samantha secret lover

Samantha: ఏంటి సమంత మళ్ళీ ప్రేమలో పడిపోయిందా.. నిజంగానే సమంత రహస్యంగా బాయ్ ఫ్రెండ్ ని మెయింటైన్ చేస్తుందా..ఈ మధ్యకాలంలో ఆమె ప్రేమకు సంబంధించిన పోస్టులు కూడా చాలానే పెడుతుంది. నిజంగానే ప్రేమలో పడిపోయిందా ఏంటి అని ఆమె అభిమానులంతా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మరి ఇంతకీ సమంత మళ్ళీ ప్రేమలో పడిపోయింది అనడానికి కారణాలు ఏంటి అన్న సంగతి ఇప్పుడు తెలుసుకుందాం.

Samantha secret lover

సమంత రీసెంట్ గా అంటే ఏప్రిల్ 28న 37వ బర్త్ డే ని చాలా గ్రాండ్గా జరుపుకుంది.ఇక తన బర్త్డే కోసం ఆమె గ్రీస్ రాజధాని అయిన ఏథెన్స్ కి వెళ్లి అక్కడ వెకేషన్ ని చాలా ఎంజాయ్ చేసింది. ఇక ఆ సమయంలో తన ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేసిన ఫొటోస్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. సమంత గురించి తాజాగా ఒక సంచలన విషయం బయటపడింది. అదేంటంటే ఏథెన్స్ లో జరిగిన సమంత బర్త్డే వేడుకలకు సమంత రహస్య ప్రేమికుడు కూడా వచ్చారని తెలుస్తోంది. (Samantha)

Also Read: Allari Naresh: అల్లరి నరేష్ కెరీర్ లో తన ఫేవరెట్ సినిమా ఏంటో తెలుసా..!

అయితే గత కొద్ది రోజులుగా ఒక వ్యక్తి సమంతని ప్రేమిస్తున్నాడని,సమంత పుట్టినరోజు ఆ విషయాన్ని సమంతకి తెలియజేయగా ఆమె కూడా యాక్సెప్ట్ చేసినట్టు తెలుస్తోంది.ఇక సమంతకి బర్త్డే రోజు ఆ వ్యక్తి ఒక చైన్ ఇచ్చి ప్రపోజ్ చేశారట.అయితే ఆ చైన్ రోజ్ గోల్డ్ .. అలాగే ఆ చైన్ మధ్యలో లాకెట్ లాగా దిష్టి తగలకుండా దిష్టి లాకెట్ కూడా ఉండడం గమనించవచ్చు.అయితే దీనికి సంబంధించిన ఫోటో ని సమంత తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేస్తూ ఆ చైన్ కనిపించేలా జూమ్ చేసి పిక్ షేర్ చేసింది.

Samantha secret lover

ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట్లో చక్కర్లు కొట్టడంతో సమంత బర్త్డేకి తన రహస్య ప్రేమికుడు దీన్ని గిఫ్ట్ గా ఇచ్చారు కావచ్చు అందుకే అలా స్పెషల్ గా దీన్ని షేర్ చేసుకుంది అని కామెంట్స్ పెడుతుంటే.. మరి కొంతమంది ఏమో ఇలాంటి చెడు ప్రచారాలు చేసేవాళ్ల నోళ్లకి అడ్డు అదుపు ఉండదు. ఎవరు ఇచ్చినా కూడా అది బాయ్ ఫ్రెండ్ ఇచ్చినట్టేనా అని ఆ కామెంట్లకు కౌంటర్ ఇస్తున్నారు.(Samantha)

Join WhatsApp