Samyakta Menon visited Srivara on foot

Samyakta Menon: ప్రస్తుత కాలంలో స్టార్ హీరో మరియు హీరోయిన్లు ఎక్కువ శాతం టెంపుల్స్ కి వెళ్తూ అక్కడ తమ భక్తి ప్రతిష్టలను చూపించుకుంటున్నారు. ఇక తాజాగా ఇదే క్రమంలో ఓ ముద్దుగుమ్మ సైతం శ్రీవారిని దర్శించుకుంది. ఆమె మరెవ్వరో కాదు సంయుక్త. పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన భీమ్లా నాయక్ సినిమాలో రానాకి వైఫ్ పాత్రలో పోషించిన సంయుక్త అనంతరం హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది.

Samyakta Menon visited Srivara on foot

2022లో విడుదలైన ఈ మూవీ పెద్దగా ఆకట్టుకోలేక పోయినప్పటికీ అందులోని సంయుక్త నటన‌నికి మాత్రం మంచి ప్రశంసలు దక్కాయి. ఇక అనంతరం కొదువ, బింబిసారా, గాలిపటం 2 , సార్, విరూపాక్ష వంటి సినిమాల్లో నటించి మంచి గుర్తింపును సంపాదించుకుంది. నిజానికి సంయుక్తాకి స్టార్ స్టేటస్ ఇచ్చిన సినిమాలు మాత్రం సార్ మరియు విరూపాక్ష అనే చెప్పుకోవచ్చు.

Also Read: Varun Tej: మెగా ఫ్యామిలీలో చిచ్చు పెట్టిన వరుణ్ తేజ్ నిర్ణయం.. అన్నదమ్ములు రెండుగా విడిపోయారా..?

విరూపాక్షా సినిమాలో ఈ ముద్దుగుమ్మ నటనకి ప్రతి ఒక్కరూ మైమరిచిపోయారు. సాయి దుర్గ తేజ్ హీరోగా నటించిన ఈ మూవీలో సంయుక్త తన నటనతో విధ్వంసం పుట్టించింది. ఇక ఒక్కసారిగా తన దగ్గరికి అవకాశాలు క్యూ కట్టినప్పటికీ అన్నిటికీ ఒకే చెప్పకుండా సరైన కథలను ఎంచుకుంటూ ప్రస్తుతం ఇండస్ట్రీలో టాప్ పొజిషన్లో కొనసాగుతుంది సంయుక్త. తనకి ప్రాధాన్యత ఇచ్చే పాత్రలను మాత్రమే ఎంచుకుంటూ పోతుంది సంయుక్తా మీనన్.

Samyakta Menon visited Srivara on foot

ఇక‌ మారి మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఇక ఇదిలా ఉంటే తాజాగా సంయుక్తా మీనన్ శ్రీవారిని దర్శించుకుంది. శ్రీవారి మెట్లను ఎక్కుతూ తన భక్తి భావుద్వేగాలను చూపించుకుంది. ఎంతో సాంప్రదాయ పద్ధతిలో డ్రెస్ ని ధరించి గుడికి హాజరయ్యింది సంయుక్త. ఇక ఈమెను చూసిన వారంతా ఆగి ఆమెతో మాట్లాడేందుకు ప్రయత్నించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి.(Samyakta Menon)

Join WhatsApp