Sandeep Reddy Vanga Remuneration For Spirit Movie

Sandeep Reddy Vanga: సినీ ప‌రిశ్ర‌మ‌లోకి ఎంతో మంది ద‌ర్శ‌కులు వ‌స్తుంటారు. కానీ వారిలో కొంద‌రు మాత్ర‌మే త‌మ‌దైన మార్క్ క్రియేట్ చేస్తుంటారు. హీరోల‌తో స‌మానంగా క్రేజ్ సంపాదించుకుంటారు. డైరెక్ట‌ర్ సందీప్ రెడ్డి వంగా కూడా ఆ కోవ‌కే చెందుతారు. ఇప్ప‌టి వ‌ర‌కు చేసింది కేవ‌లం మూడు సినిమాలే అయినా పాన్ ఇండియా రేంజ్ లో సందీప్ నేమ్ అండ్ ఫేమ్ ద‌క్కించుకున్నాడు. ద‌ర్శ‌కుడిగా ఇత‌డి ప్ర‌యాణం అర్జున్ రెడ్డి మూవీతో ప్రారంభం అయింది. 2017లో విడుద‌లైన ఈ చిత్రం సంచ‌ల‌న విజ‌యాన్ని న‌మోదు చేసింది.

Sandeep Reddy Vanga Remuneration For Spirit Movie

ఆ త‌ర్వాత ఇదే చిత్రాన్ని బాలీవుడ్ లో కబీర్ సింగ్ పేరుతో రీమేక్ చేశాడు. క‌బీర్ సింగ్ విజ‌య‌వంతం కావ‌డంతో సందీప్ రెడ్డికి బాలీవుడ్ లో మంచి గుర్తింపు వ‌చ్చింది. అలాగే బాలీవుడ్ స్టార్ ర‌ణ‌బీర్ క‌పూర్ తన త‌దుప‌రి చిత్రాన్ని డైరెక్ట్ చేసే ఛాన్స్ సందీప్ కు ఇచ్చాడు. అలా వీరి క‌ల‌యిక‌లో వ‌చ్చిన చిత్రం యానిమ‌ట్‌. గ‌త ఏడాది హిందీతో పాటు తెలుగు, త‌మిళ్‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో విడుద‌లైన ఈ చిత్రం బిగ్గెస్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిలిచింది.

బాక్సాఫీస్ వ‌ద్ద రూ. 1000 కోట్ల రేంజ్ లో వ‌సూళ్ల‌ను సాధించింది. ర‌ణ‌బీర్ క‌పూర్ కెరీర్ లోనే అత్య‌ధిక వ‌సూళ్ల‌ను అందుకున్న చిత్రంగా రికార్డు సృష్టించింది. అయితే యానిమల్ స‌క్సెస్ తో డైరెక్ట‌ర్‌ సందీప్ వంగా రెడ్డి త‌న రెమ్యున‌రేష‌న్ ను భారీగా పెంచేశాడ‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. పారితోషికం విష‌యంలో ఏకంగా ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళితో పోటీ ప‌డుతున్నాడ‌ని జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది.(Sandeep Reddy Vanga)

Also Read: Shriya Saran: అది ఎలా చేయాలో నేర్పింది నాగార్జునే.. వైర‌ల్ గా మారిన శ్రియా బోల్డ్ కామెంట్స్‌!

యానిమల్ భారీ విజయం తర్వాత, సందీప్ వంగా రెడ్డి తెలుగులో ప్ర‌భాస్ తో స్పిరిట్ అనే యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌ మూవీని ప‌ట్టాలెక్కించేందుకు రెడీ అవుతున్నాడు. ఇందులో ప్ర‌భాస్ పోలీస్ ఆఫీస‌ర్ గా క‌నిపించ‌బోతున్నాడు. టి-సిరీస్ బ్యాన‌ర్‌పై ఈ చిత్రం నిర్మితం కాబోతోంది. నిర్మాణంలో సందీప్ కూడా భాగం కానున్నాడు. టి-సిరీస్ మరియు సందీప్ రెడ్డి వంగాల జాయింట్ వెంచర్ ఇది. ప్ర‌స్తుతం ప్రీ ప్రొడెక్ష‌న్ ప‌నులు జ‌రుగుతున్నాయి. అయితే ఈ చిత్రానికి సందీప్ రెడ్డి వంగా రెమ్యున‌రేష‌న్‌ రూ. 100 నుంచి 120 కోట్ల వ‌ర‌కు ఉంటుంద‌ని.. సినిమా విడుద‌లైన త‌ర్వాతే ఆయ‌న మొత్తం పారితోషికం తీసుకుంటార‌ని ఇన్‌సైడ్ జోరుగా టాక్ న‌డుస్తోంది. కాగా, రాజ‌మౌళి ప్ర‌స్తుతం ఒక్కో చిత్రానికి రూ. 100 నుంచి 150 కోట్ల వ‌ర‌కు ఛార్జ్ చేస్తున్నారు. అలాంటిది నాలుగో సినిమాకే సందీప్ ఆయ‌నతో పోటీ ప‌డ‌టం అంటే మామూలు విష‌యం కాద‌నే చెప్పొచ్చు.

Join WhatsApp