Sania Mirza's Husband Pays Massive Sum in Maintenanc

Sania Mirza: ఈ మధ్యకాలంలో చాలామంది పెళ్లయిన కొద్ది రోజులకే విడాకులు తీసుకుంటున్నారు. మరికొంతమందేమో పెళ్ళై చాలా సంవత్సరాలు కాపురాలు చేశాక కూడా ఇద్దరి మధ్య సఖ్యత కుదరక విడాకుల తీసుకొని విడిపోతున్నారు. అయితే తాజాగా భారత టెన్నిస్ క్రీడాకారిణి అయిన సానియా మీర్జా పాకిస్తాన్ ఫేమస్ క్రికెటర్ షోయబ్ మాలిక్ ఇద్దరు విడాకులు తీసుకొని విడిపోయిన సంగతి మనకు తెలిసిందే.

Sania Mirza’s Husband Pays Massive Sum in Maintenance

అయితే వీరి విడాకుల వార్తలు ఇప్పుడు కాదు గత సంవత్సరం నుండి మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. కానీ వాటి గురించి ఈ ఇద్దరిలో ఏ ఒక్కరూ క్లారిటీ ఇవ్వలేదు. ఇక షోయబ్ మాలిక్ మూడో పెళ్లి చేసుకోవడంతో వీరు విడాకులు తీసుకున్నారని అందరూ ఒక క్లారిటీ కి వచ్చారు. అయితే చాలామంది సెలబ్రిటీలు విడాకులు తీసుకున్న సమయంలో భరణంగా కోట్ల రూపాయలు తీసుకుంటూ ఉంటారు.

Also Read: Sania Mirza: 16 ఏళ్లకే పెళ్లయిన వ్యక్తితో ప్రేమలో పడ్డ సానియా మీర్జా..ఎవరంటే..?

దాంతో సానియా మీర్జా సోయాబ్ మాలిక్ కి విడాకులు ఇచ్చిన సమయంలో ఎంత భరణం డిమాండ్ చేసిందో తెలుసా అంటూ సోషల్ మీడియాలో ఒక వార్త చక్కర్లు కొడుతోంది. మరి ఇంతకీ సానియా మీర్జా షోయబ్ మాలిక్ దగ్గర భరణం ఎంత తీసుకుందో తెలిస్తే మీరందరూ ఆశ్చర్య పోవాల్సిందే. ఎందుకంటే సానియా మీర్జా తన భర్త నుండి విడాకులు తీసుకున్నందుకు ఒక్క రూపాయి కూడా భరణంగా తీసుకోలేదట.

Sania Mirza's Husband Pays Massive Sum in Maintenanc

అంతేకాదు తనకి మాజి భర్త నుండి ఒక్క రూపాయి కూడా అవసరం లేదని,తాను స్వశక్తితో పనిచేసి సంపాదించుకోగలనని, తనకి సంపాదించుకునే శక్తి ఉందని, తనకు ఎవరి డబ్బులు అవసరం లేదని చెప్పి విడాకుల పేపర్స్ మీద డైరెక్ట్ గా సంతకం పెట్టి వెళ్లిపోయిందట. ఇక టెన్నిస్ క్రీడాకారిణి అయిన సానియా మీర్జా కి ఆస్తిపాస్తులు బాగానే ఉన్నాయి. ఈమె కొన్ని యాడ్స్ అలాగే టెన్నిస్ ద్వారా బాగానే సంపాదించినట్టు తెలుస్తోంది. అందుకే భర్త నుండి విడిపోయిన సమయంలో ఒక్క రూపాయి కూడా భరణం తీసుకోలేదట. (Sania Mirza)

Join WhatsApp