Sharathulu Varthishtayi Movie Review

Review: నటీనటులు: చైతన్య రావు, భూమిశెట్టి, నందకిషోర్, రాధికా, వెంకీ, పెద్దింటి అశోక్ తదితరులు
బ్యానర్ : స్టార్ లైట్ స్టూడియోస్
సంగీతం : అరుణ్ చిలువేరు
నిర్మాతలు: నాగార్జున సామ‌ల‌, శ్రీష్ కుమార్ గుండా, డాక్ట‌ర్ కృష్ణ‌కాంత్ చిత్త‌జ‌ల్లు
దర్శకత్వం: కుమార‌స్వామి
విడుదల: 15 మార్చి 2024

ఇటీవలే కాలంలో సమాజంలో జరుగుతున్న మోసాలపై అవగాహనా తీసుకొస్తూ చేసిన సినిమా ‘ షరతులు వర్తిస్తాయి’. చైతన్య రావు, భూమిశెట్టి హీరో హీరోయిన్ లు గా నటించిన ఈ సినిమా ఈ రోజే విడుదల అయ్యింది. ఈ సినిమా ను స్టార్ లైట్ స్టూడియోస్ బ్యాన‌ర్‌పై నాగార్జున సామ‌ల‌, శ్రీష్ కుమార్ గుండా, డాక్ట‌ర్ కృష్ణ‌కాంత్ చిత్త‌జ‌ల్లు నిర్మించగా అరుణ్ చిలువేరు సంగీతం సమకూర్చారు. ఇప్పటికే అప్డేట్స్ తో ప్రేక్షకులను అలరించిన ఈ సినిమా ఎలా ఉందో ఈ సమీక్షలోకి వెళ్లి చూద్దాం.

Sharathulu Varthishtayi Movie Review

కథ: నీటిపారుదలశాఖ లో క్లర్క్ గా పనిచేస్తుంటాడు చిరంజీవి (చైతన్య రావు). చిన్నతనం నుండే విజయశాంతి (భూమిశెట్టి) తో ప్రేమలో ఉంటాడు. ఉద్యోగాలు చేస్తూ కుటుంబ బాధ్యతలు నిర్వర్తిస్తున్న వీరు పెళ్లి చేసుకోవడానికి వెనడుగువేస్తుంటారు. ఒకానొక సమయంలో వీరిద్దరికి పెళ్లవుతుంది. ఇదే టైం లో చిరంజీవి స్నేహితులు తక్కువ పెట్టుబడితో ఎక్కువ డబ్బులు అందించే ఓ స్కీం లో చేరమని వత్తిడి చేస్తుంటారు. కానీ అలా వచ్చిన డబ్బు నిలవదని చెప్తాడు. అయితే తనకు తెలియకుండా విజయశాంతి ఆ స్కీం లో డబ్బులు పెడుతుంది. ఓ రోజు ఆ స్కీం స్టార్ట్ చేసిన కంపెనీ ఎత్తివేయడంతో తమ డబ్బు పోయిందని ఊరంతా బాధపడుతుంది.ఇంతకీ ఆ కంపెనీ ఎవరిదీ.. మోసం చేసిన కంపెనీ ఎక్కడికిపోయింది. దీనివెనుక ఎవరి కుట్ర ఉంది అనేదే ఈ సినిమా కథ.

నటీనటులు: మిడిల్ క్లాస్ వ్యక్తిగా చైతన్య రావు చాలా బాగా నటించాడు. ఆయన సినిమా సినిమా కి మంచి మంచి పాత్రలు చేస్తూ పరిణితి కనపరుస్తున్నాడు. సినిమా అంతా తన భుజాలపై మోశాడు. ఎంతో హుందాగా, సింపుల గా కనిపిస్తూ పర్ఫెక్ట్ మంచోడిగా కనపడ్డాడు. ఇక భూమి శెట్టి కూడా మంచి అభినయాన్ని ప్రదర్శించింది. ప్రేమికురాలిగా, మిడిల్ క్లాస్ గృహిణిగా ఎంతో చక్కగా మెప్పించింది. డీ గ్లామర్ రోల్ లో అలరించింది. నందకిషోర్, రాధికా, వెంకీ, పెద్దింటి అశోక్ ఇలా చాలా మంది నటీనటులు తమ పాత్రల్లో చాలా బాగా నటించారు.

సాంకేతిక నిపుణులు: తెలంగాణ యాసలో సినిమా మొత్తాన్ని తెరకెక్కించడం సినిమాకు బలం. దర్శకుడు ఎంతో హుందాగా ఈ సినిమా కథని తెరకెక్కించాడు. కరీంనగర్ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరించడం లొకాలిటీ ని జ్ఞాపకం చేస్తుంది. సినిమా విజువల్స్ చాలా బాగున్నాయి. భావోద్వేగ సన్నివేశాలకు నేపథ్య సంగీతం బాగుంది. పాటలు బాగున్నాయి. ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న మోసాల గురించి ఈ సినిమా లో చక్కగా వివరించాడు. దర్శకుడు కుమారస్వామి కథకు తగ్గ ఎమోషన్ ను తీసుకొచ్చి చాల బాగా తెరకెక్కించాడు. నిర్మాణ విలువలు బాగున్నాయి.

ప్లస్ పాయింట్స్:

చైతన్య రావు నటన

సినిమాటోగ్రఫీ

నిర్మాణ విలువలు

మైనస్ పాయింట్స్ :

స్క్రీన్ ప్లే

తీర్పు: ఓవరాల్ గా షరతులు వర్తిస్తాయి సినిమా ఓ మధ్యతరగతి కుటుంబ కథ. సాఫీగా సాగుతున్న ఓ మధ్యతరగతి కుటుంబ జీవితం డబ్బుపై ఆశతో ఎలాంటి పరిస్థితులలోకి వెళ్లిందో సినిమా ద్వారా తెరపై చూడొచ్చు.

రేటింగ్: 3/5

Join WhatsApp