Sharukh Khan wife ran away unable to bear the torture

Sharukh Khan: ఏంటి బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ టార్చర్ భరించలేక ఆయన భార్య ఆయన్ని వదిలిపెట్టి పారిపోయిందా.. ఇంతకీ షారుఖ్ ఖాన్ ఎందుకు ఆమెను టార్చర్ చేశారు.. గౌరీ ఖాన్ పారిపోవాల్సిన అవసరం ఏం వచ్చింది అనే సంగతి ఇప్పుడు తెలుసుకుందాం. బాలీవుడ్ కింగ్ ఖాన్ గా పేరు తెచ్చుకున్న షారుక్ ఖాన్ రీసెంట్గా జవాన్ మూవీ తో సౌత్ సినీ ప్రియులను కూడా ఆకట్టుకొని ఇక్కడ కూడా ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు. అయితే అలాంటి షారుక్ ఖాన్ 1991లో గౌరీ ఖాన్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.

Sharukh Khan wife ran away unable to bear the torture

అయితే వీరి పెళ్లికి గౌరీ ఖాన్ తల్లిదండ్రులు ఒప్పుకోలేదు.అయినప్పటికీ పారిపోయి పెళ్లి చేసుకున్నారు అయితే షారుఖ్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న గౌరీఖాన్ ఎందుకు వదిలేసి పారిపోయింది అనుకుంటున్నారా.. అయితే ఇది పెళ్లయ్యాక కాదు పెళ్లి కాకముందు జరిగిన ఒక సంఘటన..అసలు విషయం ఏమిటంటే.. షారుక్ ఖాన్ ఓ బర్త్డే పార్టీలో గౌరీ ఖాన్ ని చూశారట. ఆమెను చూసి తొలిచూపులోనే ప్రేమలో పడిపోయిన షారుక్ ఖాన్ నాతో డాన్స్ చేయండి అని అడగగా.. లేదు నేను నా బాయ్ ఫ్రెండ్ కోసం చూస్తున్నాను అని గౌరిఖాన్ అబద్ధం చెప్పిందట. (Sharukh Khan)

Also Read: Nayanatara: నయనతార పెట్టుకున్న వాచ్ తో ఓ లగ్జరీ ఇల్లు కట్టేయొచ్చు.. ఇంతకీ ధర ఎంతంటే.?

అయితే గౌరీఖాన్ తన బాయ్ ఫ్రెండ్ కోసం కాకుండా తన సోదరుడి కోసం వెయిట్ చేస్తుంది అనే నిజం తెలుసుకున్న షారుఖ్ ఖాన్ ఆమెని ఫాలో చేయడం మొదలు పెట్టారట. అలా ఏ పార్టీకి వెళ్లినా కూడా ఆ పార్టీకి షారుఖ్ కూడా వెళ్లేవారట. అలా చివరికి షారుఖ్ ప్రేమలో గౌరీఖాన్ పడిపోయిందట. కానీ షారుఖ్ పొసెసివ్ నెస్ తట్టుకోలేక గౌరీఖాన్ షారుక్ ఖాన్ కి చెప్పకుండానే ముంబై కి పారిపోయిందట. అయితే ఈ విషయం షారుక్ ఖాన్ తన తల్లికి చెప్పి ఆమెనే నాకు సరైన జోడి అని చెప్పారట దానికి తల్లి కూడా కొడుకు ప్రేమను అంగీకరించి 10 వేలు షారుఖ్ చేతిలో పెట్టి ముంబై వెళ్లి నా కోడలు ఎక్కడ ఉన్నా సరే వెతికి తీసుకురా అని చెప్పిందట.

Sharukh Khan wife ran away unable to bear the torture

దాంతో ఎంతో హ్యాపీగా పదివేలు తీసుకొని ముంబైకి వెళ్లి తన ప్రియురాలు కోసం వెతకడం స్టార్ట్ చేశారషారుఖ్.అలా వెతుకుతుండగా చివరికి గౌరీఖాన్ షారుక్ ఖాన్ కి ఓ బీచ్ లో కనిపించింది.ఇక ఇద్దరూ చాలా రోజుల తర్వాత చూసుకోవడంతో గట్టిగా ఏడ్చేసారట.అయితే షారుక్ ఖాన్ గౌరీ ఖాన్ మతాలు వేరువేరు కావడంతో గౌరిఖాన్ ఇంట్లో వాళ్ళు వీరి పెళ్లికి అంగీకరించకపోవడంతో షారుక్ ఖాన్ గౌరీఖాన్ ని వారి పేరెంట్స్ ని ఎదిరించి పెళ్లిచేసుకున్నాడు.అయితే షారుక్ ఖాన్ మొదట గౌరీఖాన్ ప్రేమలో పడింది 18 ఏళ్ల వయసులోనేనట. ఇక ఆ సమయంలో గౌరీఖాన్ వయసు 14 ఏళ్లేనట.(Sharukh Khan)

Join WhatsApp