Shivani Rajashekar Decided To Say GoodBye To Acting

Shivani Rajashekar: సినిమా ఇండ‌స్ట్రీలో అవ‌కాశాలు ద‌క్కించుకుని నిల‌దొక్కుకోవ‌డం అంత సుల‌భం కాదు. బ్యాక్‌గ్రౌండ్ ఉంటే సినిమా రంగంలో స‌క్సెస్ అవ్వ‌డం ఈజీ అని కొంద‌రు భావిస్తుంఆరు. కానీ అది నిజం కాద‌ని ఎంతో మంది ఫ్రూవ్ చేశారు. బ్యాక్‌గ్రౌండ్ ఉంటే ఎంట్రీ మాత్ర‌మే సుల‌భం అవుతుంది. ఆ త‌ర్వాత స‌క్సెస్ అనేది టాలెంట్ మ‌రియు అదృష్టంపైనే ఆధార‌ప‌డి ఉంటుంది. అయితే టాలెంట్ ఉన్నా కూడా అదృష్టం లేక‌పోవ‌డం వ‌ల్ల ఎంద‌రో న‌టీన‌టులు ఇండ‌స్ట్రీలో రాణించ‌లేక‌పోతున్నారు.

Shivani Rajashekar Decided To Say GoodBye To Acting

రాజ‌శేఖ‌ర్‌-జీవిత దంప‌తుల పెద్ద కూతురు, హీరోయిన్ శివాని రాజ‌శేఖ‌ర్ కూడా ఆ కోవ‌కే చెందుతుంది. 1996లో జ‌న్మించిన శివాని ఎంబీబీఎస్ పూర్తి చేసింది. ఆ త‌ర్వాత న‌ట‌న‌పై ఉన్న మ‌క్కువ‌తో త‌ల్లిదండ్రుల బాట‌లోనే సినిమా ఇండ‌స్ట్రీ వైపు అడుగులు వేసింది. న‌టిగా ఉన్న‌త స్థాయికి చేరుకోవాల‌ని భావించింది. కానీ, ఆమెకు అడుగ‌డుగునా చేదు అనుభ‌వాలే ఎదుర‌య్యాయి. శివాని ఫ‌స్ట్ మూవీ 2 స్టేట్స్‌. 2018లో ఈ సినిమా ప్రారంభ‌మైంది. కానీ షూటింగ్ స్టార్ట్ కాక‌ముందే ఈ ప్రాజెక్ట్ అట‌కెక్కింది.

తొలి సినిమానే ఆగిపోవ‌డంతో శివాని డిప్రెష‌న్ కు లోనైంది. దాదాపు మూడేళ్ల త‌ర్వాత అద్భుతం మూవీతో హీరోయిన్ గా తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టింది. ఆ త‌ర్వాత డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ, శేఖర్‌, కోట బొమ్మాళి పీ.ఎస్ చిత్రాల్లో న‌టించింది. మ‌రోవైపు త‌మిళంలో రెండు మూడు సినిమాలు చేసింది. కానీ ఇంత వ‌ర‌కు శివానికి స‌రైన హిట్ మాత్రం ప‌డ‌లేదు. న‌టిగా ఆమె మంచి మార్కులే వేయించుకున్నా.. సక్సెస్ కు మాత్రం ఆమ‌డ దూరంలోనే ఆగిపోయింది.(Shivani Rajashekar)

Also Read: Sandeep Reddy Vanga: యానిమ‌ల్ స‌క్సెస్‌తో రెమ్యున‌రేష‌న్ భారీగా పెంచేసిన సందీప్ రెడ్డి వంగా.. ఏకంగా అన్ని కోట్లా..?

ప్ర‌స్తుతం శివానికి అవ‌కాశాలు అంతంత మాత్రంగానే మారాయి. ఇక ఇండ‌స్ట్రీలో అదృష్టం క‌లిసి రాక‌పోవ‌డంతో శివాని రాజ‌శేఖ‌ర్ కీల‌క నిర్ణ‌యం తీసుకుంద‌ని తాజాగా ఓ న్యూస్ తెర‌పైకి వ‌చ్చింది. యాక్టింగ్ కు గుడ్‌బై చెప్పి డాక్ట‌ర్ గా సెటిల్ అవ్వాల‌ని శివాని నిర్ణ‌యించుకుంద‌ట‌. ఆల్రెడీ ఎంబీబీఎస్ పూర్తి చేసిన శివాని.. ఇప్పుడు డాక్టర్ కోర్సు కోసం ప్రాక్టికల్స్ చేయడానికి సిద్ధ‌మ‌వుతుంద‌ని ఇన్‌సైడ్ జోరుగా టాక్ న‌డుస్తోంది. మ‌రి ఇది ఎంత వ‌ర‌కు నిజం అన్న‌ది తెలియాల్సి ఉంది.

Join WhatsApp