Shobha Shetty Relation with Tasty Teja

Shobha Shetty: బుల్లితెరపై ప్రముఖ ఛానల్లో ప్రసారమయ్యే బిగ్ బాస్ షో ఎంత పెద్ద పాపులారిటీ సంపాదించుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ షో ద్వారా ఎంతోమంది తెలియని వారికి గుర్తింపు వచ్చింది. గుర్తింపు ఉన్నవారు ఇండస్ట్రీలో మరింత దూసుకుపోతున్నారు.అలా ఒకరకంగా ఫేమస్ అవ్వని వారికి బిగ్ బాస్ ప్లాట్ ఫామ్ మంచి వేదిక అయింది అని చెప్పుకోవచ్చు. అయితే ఈసారి బిగ్ బాస్ 7 ఎన్నో వివాదాలు మూటకట్టుకున్న సంగతి మనకు తెలిసిందే. బిగ్ బాస్ చరిత్రలోనే మొదటిసారి బిగ్ బాస్ కప్ విన్నర్ జైలుకు వెళ్లారు. ఇదంతా పక్కన పెడితే బిగ్ బాస్ షోలో మామూలుగానే లవ్ ట్రాక్స్ ఉంటాయి.

Shobha Shetty Relation with Tasty Teja

అయితే ఈసారి ఎక్కువగా లవ్ ట్రాక్స్ అయితే కనిపించలేదు.ఇక మొదట్లో రతిక, పల్లవి ప్రశాంత్ మధ్య జరిగినప్పటికీ అది ఎండ్ అయిపోయింది.ఆ తర్వాత గౌతమ్ శుభశ్రీ మధ్య కూడా లవ్ ట్రాక్ కొద్దిరోజులు నడిచింది.కానీ ఆ తర్వాత శుభశ్రీ ఎలిమినేట్ అయి వెళ్ళిపోయింది. అలాగే యావర్ నయని పావని మధ్య కూడా లవ్ ట్రాక్ నడిచింది. కానీ నయని పావని కేవలం ఒక వారం మాత్రమే ఉండి హౌస్ నుండి ఎలిమినేట్ అయింది.అలా వీరి మధ్యలో ఎక్కువ రోజులు నిలువలేదు. ఇక రతికా రీ ఎంట్రీ ఇచ్చాక యావర్ రతిక మధ్య కూడా కొద్ది రోజులు నడిచింది. అలాగే బిగ్ బాస్ లో ఫైర్ బ్రాండ్ గా ఉన్న కార్తీకదీపం సీరియల్ ఫేమ్ మోనిత అంటే శోభా శెట్టి టేస్టీ తేజ మధ్య కూడా చాలా రోజులు ఏదో నడుస్తోంది అని అందరూ మాట్లాడుకున్నారు. (Shobha Shetty)

Also Read: Prabhas: స‌మంత రూట్ లోనే ప్ర‌భాస్‌.. ఫ్యాన్స్ ఈ చేదు వార్త‌ విని త‌ట్టుకోగ‌ల‌రా..?

ఎందుకంటే వీరిద్దరూ అచ్చం లవర్స్ లాగే ప్రవర్తించేవారు.అంతేకాదు ఓసారి శోభా శెట్టి మనిద్దరి మధ్య రిలేషన్ చూసి బయట తన లవర్ ఏమనుకుంటాడో అని కూడా మాట్లాడింది. అయితే హౌస్ నుండి వచ్చాక ఎన్నో జరిగిపోయాయి. ఇదంతా పక్కన పెడితే తాజాగా శోభా శెట్టి టేస్టీ తేజ గురించి ఒక వార్త చక్కర్లు కొడుతుంది. అదేంటంటే శోభా శెట్టి తన లవర్ యశ్వంత్ తో ఈ మధ్యనే ఎంగేజ్మెంట్ చేసుకున్న సంగతి మనకు తెలిసిందే.అయితే తాజాగా శోభా శెట్టి టెస్టీ తేజకు ఫోన్ చేసి మన లవ్ మేటర్ యశ్వంత్ కి తెలిసిపోయింది. అతను నన్ను తిట్టాడు. మా పెళ్లి కూడా క్యాన్సల్ అయింది అంటూ టేస్టీ తేజకి ఫోన్ చేసి శోభా శెట్టి మాట్లాడుతూ.. అంతా నీవల్లే జరిగింది.

Shobha Shetty Relation with Tasty Teja

నువ్వు మన రిలేషన్ గురించి బయట వేరే చెబుతున్నావట అని చెప్పింది. కానీ తేజ మాత్రం నువ్వు ఎలాంటి దానివో యశ్వంత్ కి తెలుసు. నీ గురించి అలా తప్పుగా అనుకోడు అంటూ చెబుతాడు.కానీ శోభా మాత్రం అంతా నీ వల్లే జరిగింది అంటూ బోరున ఏడుస్తుంది. దాంతో ఈ విషయం మొత్తం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. అలాగే టేస్టీ తేజ వల్ల ఒక జంట విడిపోయింది అంటూ అందరూ కామెంట్లు పెట్టారు. కానీ ఆ తర్వాత కొద్దిసేపటికే ఇదంతా ఫ్రాంక్ అంటూ మరో విషయం చెప్పారు. దాంతో ఈ విషయం తెలిసిన చాలామంది వీరిపై దుమ్మెత్తిపోస్తున్నారు.. వ్యూస్ కోసం,లైక్ ల కోసం ఇలాంటి చెత్త వీడియోస్ చేస్తారా అంటూ తిట్టిపోస్తున్నారు.(Shobha Shetty)

Join WhatsApp