Shraddha Das Shared Worst Experience With Mannara Chopra

Shraddha Das: హాట్ బ్యూటీ శ్రద్ధా దాస్ గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. సిద్దూ ఫ్రమ్ సికాకుళం మూవీతో సినీ కెరీర్ ప్రారంభించిన శ్ర‌ద్ధా దాస్‌.. తెలుగులోనే కాకుండా మలయాళం, హిందీ, బెంగాలీ మరియు కన్నడ భాష‌ల్లోనూ సినిమాలు చేసింది. స్టార్ హీరోయిన్ గా ఎద‌గ‌లేక‌పోయినా త‌న‌కంటూ ఒక స్పెష‌ల్ ఇమేజ్ ను సంపాదించుకోగ‌లిగింది. ఇప్ప‌టికీ వ‌రుస సినిమాల్లో న‌టిస్తూ కెరీర్ ను కొన‌సాగిస్తోంది. ఇదిలా ఉంటే.. ఓ బాలీవుడ్ హీరోయిన్ తనను దారుణంగా కొట్టిందంటూ శ్ర‌ద్ధా దాస్ గ‌తంలో ఆవేద‌న వ్య‌క్తం చేసింది.

Shraddha Das Shared Worst Experience With Mannara Chopra

ఇంత‌కీ ఆ హీరోయిన్ మ‌రెవ‌రో కాదు మన్నారా చోప్రా. ఈమె అగ్ర తార ప్రియాంక చోప్రాకు క‌జిన్ అవుతుంది. హిందీ మ‌రియు త‌మిళ‌ సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న మన్నారా చోప్రా.. ప్ర‌స్తుతం బాలీవుడ్ బిగ్ బాస్ సీజన్ 17 టైటిల్ కోసం పోరాడుతోంది. ఈసారి క‌ప్‌ కొట్టే రేసులో ఆరుగురు కంటెస్టెంట్స్ ఫైనల్ కు చేరుకున్నారు. ఈ జాబితాలో మ‌న్నారా చోప్రా ఒక‌టి. ఆరంభం నుంచి తన బిహేవియర్, ఆట తీరుతో ఆడియన్స్ ని మ‌న్నారా ఎంత‌గానో ఆక‌ట్టుకుంది.

Shraddha Das Shared Worst Experience With Mannara Chopra

తోటి కంటెస్టెంట్స్ కు గ‌ట్టి పోటీ ఇచ్చింది. ఈ రోజుతో బిగ్ బాస్ సీజ‌న్ 17 ఎండ్ కాబోతోంది. హౌస్ లో అత్యుత్తమ ప్రదర్శన కనబరచడంతో మ‌న్నారాను విజేత‌గా చేయాల‌నే మాట‌లు వినిపించాయి. కానీ, ఆమెకు టైటిల్ ద‌క్కే అవ‌కాశం లేద‌ని ప‌లు స‌ర్వాలే తేల్చాయి. మోస్ట్ పాపులర్ కంటెస్టెంట్ మునావర్ ఫరూఖీ సీజ‌న్ 17 విన్న‌ర్ గా నిలుస్తుందని బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. ఇక ఇదే త‌రుణంలో మ‌న్నారా చోప్రాపై గ‌తంతో శ్రద్ధా దాస్ చేసిన కామెంట్స్ వైర‌ల్ గా మారాయి.(Shraddha Das)

Also Read: Anjana Sarja: హీరో అర్జున్ స‌ర్జా చిన్న కూతురు న‌యా బిజినెస్.. ఇలాంటివి కూడా చేస్తారా?

మ‌న్నారా చోప్రా, శ్రద్ధా దాస్ క‌లిసి జిద్ అనే హిందీ సినిమా చేశారు. అయితే ఈ మూవీ చిత్రీక‌ర‌ణ స‌మ‌యంలో మ‌న్నారా మ‌రియు శ్రద్ధా దాస్ మ‌ధ్య పెద్ద గొడ‌వే జ‌రిగింద‌ట‌. సినిమాలో భాగంగా మన్నారా శ్రద్దా ను తోసే సన్నివేశం ఉందట. నెమ్మ‌దిగా నెట్టమని చెప్పినా కూడా మన్నారా వినకుండా గట్టిగా నెట్టేసిందట. దాంతో మెట్లు తగిలి శ్రద్ధాకు గాయం అయ్యిందట. అలాగే ఓ సీన్ లో కావాల‌నే మ‌న్నారా శ్రద్ధా ఛాతిపై స్ట్రోంగ్ పంచ్ ఇచ్చింద‌ట‌. మ‌రో స‌న్నివేశంలో డైరెక్ట‌ర్ క‌ట్ చెప్పినా కూడా రెచ్చిపోయి శ్రద్ధాను చిత‌క‌బాదింద‌ట‌. ఓ ఫైట్ సీన్ లో డమ్మీ స్టిక్ తో కాకుండా రియ‌ల్ స్టిక్ తో కొట్టింద‌ని.. మ‌న్నారా కార‌ణంగా త‌న‌కు శ‌రీరంలో దాదాపు 30 గాయాలు అయ్యాయ‌ని.. హాస్పటల్ లో చేరాల్సి వచ్చింద‌ని శ్రద్దా ఓ ఇంట‌ర్వ్యూలో చెప్పుకొచ్చింది. ఇప్పుడామె కామెంట్స్ మ‌రోసారి వైర‌ల్ అవుతున్నాయి.

Join WhatsApp