Shriya Saran Interesting Comments On Nagarjuna

Shriya Saran: 40 దాటినా చెక్కు చెదరని అందంతో అల్లాడిస్తున్న శ్రియా శరణ్ ను సినీ ప్రియులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు టాలీవుడ్ లో శ్రియా టాప్ హీరోయిన్ గా సత్తా చాటింది. బాలకృష్ణ, నాగార్జున, చిరంజీవి, వెంకటేష్ వంటి సీనియర్ స్టార్స్ తో పాటు మహేష్ బాబు, ఎన్టీఆర్ వంటి యంగ్ స్టార్స్ తో స్క్రీన్ షేర్ చేసుకుంది. తెలుగులో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది. అలాగే తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లోనూ పనిచేసింది.

Shriya Saran Interesting Comments On Nagarjuna

హీరోయిన్ గా ఫామ్ లో ఉన్న సమయంలోనే పెళ్లి పీటలు ఎక్కింది. 2018లో ర‌ష్యాన్ ప్రియుడు ఆండ్రీ కోస్చీవ్ తో ఏడు అడుగులు వేసింది. ఈ దంపతులకు రాధా అనే కూతురు జన్మించింది. వివాహ‌మై ఓ బిడ్డ‌కు తల్లైనా కూడా శ్రియా మంచి ఫిజిక్ ను మెయింటైన్ చేస్తూ న‌టిగా సత్తా చాటుతోంది. ముఖ్యంగా బాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ చిత్రాల్లో నటిస్తూ అలరిస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్రీయ టాలీవుడ్ కింగ్ నాగార్జున పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

తెలుగులో నాగార్జున, శ్రియాలది హిట్‌ కాంబినేషన్. వీరిద్దరూ సంతోషం, నేనున్నాను, ఊపిరి, మనం వంటి సినిమాల్లో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఈ చిత్రాల్లో నాగార్జున, శ్రియా కెమిస్ట్రీ వెండితెరపై ఎంతో అద్భుతంగా వ‌ర్కోట్ అయింది. అయితే తాజాగా నాగార్జున గురించి శ్రియా కొన్ని బోల్డ్ కామెంట్స్ చేసింది. సౌత్ ఇండస్ట్రీలో ఎంద‌రో గొప్ప నటులు ఉన్నారని.. వారిలో నాగార్జున ఒకరిని శ్రియా కొనియాడింది.(Shriya Saran)

Also Read: Alia Bhatt: బెంచీలు తుడిచిన స్థాయి నుంచి స్టార్ హీరోయిన్ గా ఎదిగిన అలియా భ‌ట్ గురించి ఈ విష‌యాలు మీకు తెలుసా?

అలాగే తనకు ధ్యానం ఎలా చేయాలో అర్థం అయ్యేలా నేర్పింది నాగార్జునే అని.. దానివల్ల ఇప్పటికీ లైఫ్ లో అన్ని పరిస్థితులను ఎదుర్కొగలుగుతున్నాన‌ని మ‌రియు ప‌రిస్థితుల‌కు అనుగుణంగా పోరాడ‌గ‌లుగుతున్నాన‌ని శ్రియా తెలిపింది. స‌రైన ప‌ద్ధతిలో మెడిటేషన్ ఎలా చేయాలో నేర్పించి నాగార్జున తనకు లైఫ్‌లో ఎంతో గొప్ప సాయం చేశారని శ్రియ చెప్పుకొచ్చింది. దీంతో ఈ బ్యూటీ కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి.

Join WhatsApp