Simran as heroine in Mahesh Babu-Rajamouli movie

Mahesh Babu: ఈమధ్య స్టార్ డైరెక్టర్లు పాత హీరోయిన్లను బయటకు తీసుకొస్తున్నారు. ఫెయిడ్ అవుట్ అయ్యి.. కనిపించకుండా పోయిన తారలకు డిఫరెంట్ క్యారెక్టర్స్ ను ఇస్తూ సెకండ్ ఇన్నింగ్స్ కు కారణం అవుతున్నారు డైరెక్టర్స్. ఇక అలాంటి ప్రయత్నంలోనే తాజాగా బయటకు రాబోతుంది సిమ్రాన్. హీరోయిన్ సిమ్రాన్ మనందరికీ సుపరిచితమే. ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా కొనసాగిన ఈ ముద్దుగుమ్మ మంచి గుర్తింపును సంపాదించుకుంది. దాదాపు తెలుగు, తమిళ్ భాషల్లో హీరోయిన్గా చక్రం తిప్పింది.

Simran as heroine in Mahesh Babu-Rajamouli movie

ఆ తర్వాత హీరోయిన్గా అవకాశాలు తగ్గడంతో పెళ్లి చేసుకుని హ్యాపీ ఫ్యామిలీ లైఫ్ ను లీడ్ చేస్తుంది. ఇక ఈమధ్య కొన్ని తమిళ్ సినిమాల్లో క్యారెక్టర్ రోల్స్ లో కనిపించింది సిమ్రాన్. ఇక తెలుగులో కూడా సిమ్రాన్ ఎంట్రీ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. అది కూడా తాను హీరోయిన్ గా నటించిన సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలో అని వార్తలు వినిపిస్తున్నాయి.

Also Read: Amala: అమల చూస్తుండగానే పాడు పని చేసిన నాగార్జున.. కోపంతో ఆమె ఏం చేసిందంటే..?

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రాజమౌళి డైరెక్షన్లో ఓ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ దర్శక దీరుడు తెలుగు సినిమాకు ప్రపంచ స్థాయి గుర్తింపు తెచ్చిపెట్టిన డైరెక్టర్ రాజమౌళి. ఆయనతో ఒక సినిమాలో అయినా నటించాలని చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు. కానీ ఆ అవకాశం కొందరికి మాత్రమే దక్కుతుంది. ఇక ప్రస్తుతం రాజమౌళి.. సూపర్ స్టార్ మహేష్ బాబు తో సినిమాని చేస్తున్నారు. ఈ మూవీని ఇప్పటికే అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ఇక త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్తుంది.

Simran as heroine in Mahesh Babu-Rajamouli movie

ఇక మహేష్ బాబు ఒకప్పటి హీరోయిన్ అయినా సిమ్రాన్ ను ఇప్పుడు ఈ సినిమాలో ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తుంది. ఇక జక్కన్న ఈ సినిమాలో అయితే సిమ్రాన్ కి మెయిన్ రోల్ ఇవ్వడు. కానీ ఏదో సైడ్ రోల్ ఇచ్చే అవకాశం ఉంది. తల్లి లేదా అక్క వంటి పాత్రల్లో సిమ్రాన్ కి అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ మూవీలో అసలు హీరోయిన్ ఎవరో ఇంకా ఓ క్లారిటీ రాలేదు. త్రిబుల్ ఆర్ మూవీ తో ఆస్కార్ అందుకొని మంచి ఫామ్ లో ఉన్న జక్కన్న ప్రస్తుతం ఈ సినిమాతో ఎటువంటి రికార్డులను క్రియేట్ చేస్తాడో చూడాలి.(Mahesh Babu)

Join WhatsApp