Singer Pawan Kalyan who revealed the great mind of that anchor

Singer Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ఈ పేరులోనే ఒక పవర్ ఉంటుంది. మనం చెప్పేది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి కాదు.. సింగర్ పవన్ కళ్యాణ్ గురించి. అప్పట్లో సరిగమప.. ఇప్పుడు సూపర్ సింగర్.. తన గానంతో కోట్లాదిమంది సంగీత ప్రియులను ఆకట్టుకున్నాడు పవన్ కళ్యాణ్. వెస్టరన్, ఫోక్, హిందుస్థాని ఇలా అనేక జోనర్లలో తన గానాన్ని ప్రదర్శించి ప్రతి ఒక్కరిని ఆకట్టుకున్నాడు. సూపర్ సింగల్ షోలో తన టాలెంట్ ను ప్రదర్శించాడు. ఇక చాలామంది అతనే విన్నర్ అని అనుకున్నారు.

Singer Pawan Kalyan who revealed the great mind of that anchor

కానీ టైం బాగోకపోవడంతో పవన్ కళ్యాణ్ మూడో స్థానానికి అంకితం అవ్వాల్సి వచ్చింది. ఇక కాగా ఒక వైపు పాటలు మరియు మరోవైపు ఇంటి బాధ్యతల్ని మేనేజ్ చేస్తున్నాడు పవన్ కళ్యాణ్. ఇందుకు యాంకర్ ప్రదీప్ తనకి అండగా ఉన్నట్లు తనని చదివిస్తున్నట్లు తాజాగా వెల్లడించాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ..” మాది భీమవరం.

Also Read: Manchu Manoj: పండంటి బిడ్డకి జన్మనిచ్చిన హీరో మంచు మనోజ్ భార్య.. సంతోషంలో ఫ్యాన్స్..!

అమ్మ, నాన్న అంతా అక్కడే. కానీ నేను పుట్టి పెరిగింది అంతా ఇక్కడే హైదరాబాద్. గత 20 ఏళ్లుగా ఇక్కడే సెటిల్ అయ్యాం. నాన్న ఇక్కడే డ్రైవర్గా పని చేశారు. అమ్మ ట్యూషన్స్ చెప్తుంది. నాన్న చాలా ఏళ్లుగా డ్రైవర్ గా చేస్తున్నారు. కళ్ళు సరిగ్గా కనిపించకపోవడంతో రీసెంట్ గా మానేశారు. నేను జాబ్ లోకి వచ్చేసాను కాబట్టి పెద్దగా ఇబ్బంది లేదు. ఆయనకి టైం పాస్ కావడం లేదని.. టెంపుల్ లో వర్క్ చేస్తున్నారు. నేను పాటల్లోనే కాదు చదువులోనూ టాపే.

Singer Pawan Kalyan who revealed the great mind of that anchor

అమ్మే టోషన్ చెప్పేది. టెన్త్ క్లాస్ టాపర్ని. అక్క ఉండేది తాను చనిపోయింది. మా అమ్మకి పాటలంటే చాలా ఇష్టం. తన ఇంట్రెస్ట్ తోనే నేను సాంగ్స్ పాడడం మొదలుపెట్టాను. ఇప్పుడు నేను ఇలా ఉన్నానంటే దానికి కారణం ప్రదీప్ అన్న నే. మా దగ్గర డబ్బులు లేనప్పుడు ప్రదీప్ అన్న నన్ను చదివించాడు ” అంటూ చెప్పుకోవచ్చాడు పవన్ కళ్యాణ్. ప్రస్తుతం ఈయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.(Singer Pawan Kalyan)

Join WhatsApp