Sitara Gonna Act In Movie With that Hero

Sitara: సితార మహేష్ బాబు తనయురాలిగా సితార తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించింది.ఈమె చిన్న వయసులోనే తన అద్భుతమైన ఫోటోలతో ఎంతోమంది ప్రేక్షకుల మదులు దోచుకుంటుంది. అంతేకాదు చిన్న వయసులోనే ఒక జువెల్లరీ బ్రాండ్ లో కూడా నటించింది. అలాంటి సితార టాలీవుడ్లోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తుందా అంటే అవుననే అంటున్నారు సినీ విశ్లేషకులు. అయితే ఈ విషయంపై సితార కూడా క్లారిటీ ఇవ్వడంతో సితార సినీ ఎంట్రీ పై సోషల్ మీడియాలో వైరల్ న్యూస్ చక్కర్లు కొడుతున్నాయి. ఇక అసలు విషయంలోకి వెళ్తే.. రీసెంట్ గా నమ్రత బర్త్డే జరిగిన సంగతి మనకు తెలిసిందే.అయితే తన తల్లి బర్త్డే రోజు అభిమానులతో చిట్ చాట్ చేసింది సితార.

Sitara Gonna Act In Movie With that Hero

ఇందులో భాగంగా ఓ నెటిజన్ మీరు సినిమాల్లోకి రావాలని అనుకుంటున్నారా అని ఒక ప్రశ్న అడగగా..నాకు సినిమాలు అన్నా నటన అన్నా చాలా ఇంట్రెస్ట్ అని సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తాను అని చెప్పింది.అయితే సితార చెప్పిన ఈ విషయం నెట్టింట్లో వైరల్ అవ్వడంతో సితార త్వరలోనే ఓ యంగ్ హీరోతో కలిసి రొమా చేయబోతోంది. ఆ డైరెక్టర్ దర్శకత్వంలోనే ఈమె సినీ ఎంట్రీ ఉండబోతుంది అని రూమర్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.అయితే సితార హీరోయిన్ మెటీరియల్ అని ఇప్పటికే ఆమెను చూసిన చాలామంది అభిమానులు అంటూ ఉంటారు. (Sitara)

Also Read: Tollywood: పాన్ ఇండియా సినిమాలన్నీ వాయిదా పడడానికి కారణం..?

ఎందుకంటే ఆమె ఇంస్టాగ్రామ్ లో చేసే రీల్స్ లో డ్యాన్స్ అయినా ఆమె ఫొటోస్ అయినా సరే హీరోయిన్ లాగే కనిపిస్తాయి.అలా హీరోయిన్ కి ఉండాల్సిన అన్ని క్వాలిటీస్ సితారలో ఉన్నాయని,కచ్చితంగా సితారని ఇండస్ట్రీకి తీసుకురావాలని కొంతమంది అంటే మరి కొంతమందేమో స్టార్ హీరో కూతురు వేరే హీరోలతో రొమా చేస్తే ఎలా ఉంటుందని నెగిటివ్ కామెంట్లు పెడుతున్నారు. మరీ ముఖ్యంగా సితార కూడా తన మేనత్త మంజుల లాగే మిగిలిపోవాలి అంటూ మాట్లాడుకుంటున్నారు.

Sitara: Sitara is going to do movie with that hero..

ఎందుకంటే కృష్ణ కూతురు మంజుల కూడా సినిమాల్లో హీరోయిన్ అవ్వాలని ఎంతగానో కలలు కన్నది. అంతేకాదు బాలకృష్ణ తో ఓ సినిమాలో హీరోయిన్ గా కూడా డైరెక్టర్ ఫిక్స్ చేశారు.కానీ కృష్ణ అభిమానుల ఈ విషయంలో అడ్డుపడడంతో మంజుల సినీ ఎంట్రీ అక్కడితోనే ఆగిపోయింది. ఇక సితార విషయంలో కూడా అదే జరుగుతుంది అని,సితారను వేరే హీరోలతో రొమా** చేస్తే మహేష్ అభిమానులు తట్టుకోరని,ఆమె ని హీరోయిన్ కానివ్వరని తెలుస్తోంది. మరి చూడాలి మహేష్ బాబు తన కూతురి కోరిక మేరకు సినీ ఇండస్ట్రీలోకి తీసుకువస్తారా లేదా అనేది.

Join WhatsApp