Sneha Reddy Crazy Condition to Allu Arjun

Allu Arjun: అల్లు అర్జున్.. ఐకానిక్ స్టార్ గా మారిన ఈ హీరో ప్రస్తుతం పుష్ప-2 షూటింగ్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.అయితే ఈ సినిమా తర్వాత తన నెక్స్ట్ మూవీ సందీప్ రెడ్డి వంగా, అట్లీ, త్రివిక్రమ్ వంటి స్టార్ డైరెక్టర్లతో ఉండబోతుంది అంటూ వార్తలు వినిపిస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఇక ఈ ముగ్గురిలో ఏ డైరెక్టర్ తో చేస్తారో తెలియదు. కానీ మరో బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టడం ఖాయం అని ఇప్పుడే ఊహించుకుంటున్నారు ఆయన అభిమానులు. ఇదిలా ఉంటే ఈయన తనకి బ్లాక్ బస్టర్ హిట్స్ అయిన అలవైకుంటపురం లో, జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి వంటి సినిమాలను అందించిన దర్శకుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో మరో సినిమా చేయబోతున్నట్టు సమాచారం.

Sneha Reddy Crazy Condition to Allu Arjun

అయితే ఈ సినిమాలో ఓ స్టార్ హీరోయిన్ ని తీసుకుంటున్నట్లు ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో కొన్ని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.అయితే ఈ వార్త బన్నీ భార్య స్నేహ రెడ్డికి తెలియగానే రెండు రోజులుగా అన్నం తినడం మానేసింది అంటూ నెట్టింట్లో ఓ క్రేజీ రూమర్ చక్కర్లు కొడుతుంది.మరి ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు..ఎందుకు స్నేహ రెడ్డి అన్నం తినడం మానేసింది.. అనే సంగతి ఇప్పుడు తెలుసుకుందాం. త్రివిక్రమ్ అల్లు అర్జున్ తో మరో సినిమా తీయబోతున్నారట.(Allu Arjun)

Also Read: Mrunal Thakur: అడుక్కుంటున్నా ఛాన్సులు రావ‌డం లేదు.. ఆవేదనంతా వెల్లగక్కిన మృణాల్!

అయితే ఈ సినిమా కోసం ఈ మధ్యకాలంలో యానిమల్ మూవీ లో బోల్డ్ గా నటించి రణబీర్ కపూర్ తో రొమా లో రెచ్చిపోయి నటించిన యంగ్ బ్యూటీ త్రిప్తి డిమ్రీ ని తీసుకుందామని త్రివిక్రమ్ చెప్పారట.అయితే యానిమల్ మూవీలో త్రిప్తి డిమ్రీ బోల్డ్ నెస్ చూసిన చాలామంది తెలుగు దర్శకులు ఆమెను తమ సినిమాల్లో పెట్టుకోవాలని భావిస్తున్నారు.ఇక ఇందులో భాగంగానే త్రివిక్రమ్ కూడా బన్నితో చేయబోయే సినిమాలో త్రిప్తి డిమ్రితో రొమా చేయించాలని చూసారట.కానీ ఈ విషయం కాస్త స్నేహ రెడ్డికి తెలియడంతో రెండు రోజులు అన్నం తినడం మానేసిందట.


Sneha Reddy Crazy Condition to Allu Arjun

అసలు విషయం ఏంటా అని బన్నీ తెలుసుకోగా.. నువ్వు ఆ హీరోయిన్ తో నటిస్తే నేను అస్సలే ఊరుకోను.. వేరే ఎవరితోనైనా చేయు కానీ ఆ హీరోయిన్ తో సినిమా మాత్రం వద్దు అని కరాకండిగా చెప్పిందట.. ఇక అల్లు అర్జున్ అదంతా సినిమాలో భాగమే అని చెప్పినా కూడా వినకుండా మొండి పట్టు పట్టిందట. దాంతో అల్లు అర్జున్ చేసేదేమి లేక ఆ హీరోయిన్ తీసేసి వేరే హీరోయిన్ ని పెట్టండి అని చెప్పారంటూ ఒక రూమర్ ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతుంది.ఇక గతంలో కూడా రకుల్ ప్రీత్ సింగ్ తో నటించవద్దు అని అల్లు అర్జున్ కి స్నేహ రెడ్డి కండిషన్ పెట్టిన సంగతి మనకు తెలిసిందే.

Join WhatsApp