Sobhan Babu house worships that star hero more than God

Sobhan Babu: శోభన్ బాబు.. సౌత్ ఇండస్ట్రీలో ఎవరైనా రిచ్చెస్ట్ హీరో ఉన్నారు అంటే అందరూ చెప్పుకునేది కేవలం శోభన్ బాబు పేరు మాత్రమే.. ఆయన ఆ సమయంలోనే తను చేసిన సినిమాల ద్వారా వచ్చిన డబ్బు అంతా భూములు కొనడం మీదే ఇన్వెస్ట్ చేసి ప్రస్తుతం తన కొడుకులకు వేలకోట్ల ఆస్తులు సంపాదించి పోయారు. ఈయనని ఇండస్ట్రీలోని చాలామంది పిసినారి అంటూ ఉంటారు.

Sobhan Babu house worships that star hero more than God

అయితే ఆయన పిసినారి కాదు డబ్బులు ఎక్కడ ఎవరికి ఎలా ఖర్చు పెట్టాలో బాగా తెలిసిన వ్యక్తి. ఇక ఈ విషయాన్ని తన క్లోజ్ ఫ్రెండ్ నటుడు కృష్ణంరాజే బయట పెట్టారు. కృష్ణంరాజుకి శోభన్ బాబుకి మధ్య మంచి స్నేహబంధం ఉంది. వీరిద్దరి మధ్య స్నేహబంధం ఎలాంటిది అంటే ఒకరికి ఒకరు రా అనే పిలుచుకునేంత గట్టి బంధం ఉంది. (Sobhan Babu)

Also Read: Chiranjeevi: పవన్ కళ్యాణ్ కోసం చిరు…పిఠాపురంలో జనసేన విజయం సాధిస్తుందా ?

ఇదిలా ఉంటే హీరో శోభన్ బాబు తన ఇంట్లో ఒక స్టార్ హీరో ఫోటోలు పెట్టి దేవుడి కంటే ఎక్కువగా ఆరాదించేవారట. మరి ఆయన ఎవరా అని ఆలోచిస్తున్నారా.. ఆయన ఎవరో కాదు తెలుగు చిత్రసీమ పరిశ్రమ కీర్తి ప్రతిష్టలను దేశ విదేశాలకు పరిచయం చేసిన నందమూరి తారక రామారావు..సీనియర్ ఎన్టీఆర్ ని శోభన్ బాబు దేవుడు కంటే ఎక్కువగా కొలుస్తారట.

Sobhan Babu house worships that star hero more than God

అయితే ఈ విషయాన్ని చెప్పింది ఎవరో కాదు తన క్లోజ్ ఫ్రెండ్ కృష్ణంరాజు. ఆయన శోభన్ బాబు గురించి మాట్లాడుతూ..నేను ఓ రోజు శోభన్ బాబు ఇంటికి వెళ్లాను. అయితే ఆ సమయంలో సీనియర్ ఎన్టీఆర్ కి సంబంధించిన ఒక పెద్ద ఫోటో వారి ఇంట్లో చూశాను. అది కూడా హాల్లోనే.. చాలా పెద్ద ఫోటోని ఇంట్లో పెట్టుకుని ఒక దేవుడు కంటే ఎక్కువగా సీనియర్ ఎన్టీఆర్ ని శోభన్ బాబు ఆరాధిస్తున్నారు అంటూ ఎవరికకీ తెలియని ఒక సీక్రెట్ విషయాన్ని కృష్ణంరాజు బయట పెట్టారు,(Sobhan Babu)

Join WhatsApp