Sobhan Babu sons have sold all their assets

Sobhan Babu: దివంగత నటుడు శోభన్ బాబు గురించి చెప్తే ఎక్కువగా ఆయన ఆస్తిపాస్తులు ఆయన అందమే సినీ ప్రియులకు గుర్తుకు వస్తాయి. ఒకప్పుడు శోభన్ బాబుకి ఎంత క్రేజ్ ఉండేదంటే ఇప్పుడు మహేష్ బాబు కి ఎలా అయితే ఆడవాళ్ళలో క్రేజ్ ఉంటుందో అప్పట్లో శోభన్ బాబుకి కూడా సోగ్గాడు అనే పేరుతో అంతే క్రేజ్ ఉండేది. ఇక అప్పట్లో ఎంతో మంది లేడీ అభిమానులు శోభన్ బాబుని ఆరాధించేవారు. తమ అభిమాన హీరో సినిమా వస్తుందంటే చాలు ఎంతోమంది థియేటర్లకు పరుగులు తీసేవారు.

Sobhan Babu sons have sold all their assets

అయితే అలాంటి శోభన్ బాబు సినిమాల్లోకి ప్రవేశించాక వచ్చిన డబ్బుని చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టేవారు. ఇక అంత పెద్ద హీరో అయినా సరే కొన్ని కొన్ని సందర్భాలలో పిసినారితనం కూడా చూపించేవారట.ఇక తనతో పాటు పదిమంది బతకాలి అనే ఉద్దేశంతో ఎంతోమంది తనతో నటించిన కో యాక్టర్స్ కి వచ్చిన సంపాదనతో భూముల మీద ఇన్వెస్ట్ చేయమని చెప్పేవారు. ఇక అప్పట్లోనే ఈయన ఎన్నో వందల ఎకరాల భూములను కొనుగోలు చేశారు.అంతే కాదు ఈయన కి సినిమా ద్వారా వచ్చిన పెట్టుబడి మొత్తం భూముల మీదనే ఇన్వెస్ట్ చేశారు. ఇక అప్పట్లోనే ఈయన భూముల రేట్లు భవిష్యత్తులో ఆకాశాన్ని అంటుతాయి అని గ్రహించి అలా చేశారట.(Sobhan Babu)

Also Read: Chiranjeevi: జగన్ మీద పగతో మళ్ళీ రాజకీయాల్లోకి చిరంజీవి..?

ఇక ఆయనకి వేలకోట్ల ఆస్తి ఉందని,ఇండియాలో ఉన్న రిచెస్ట్ హీరోలలో శోభన్ బాబు ముందు ఉంటారని ఇప్పటికే ఎంతోమంది చెబుతూ ఉంటారు.అయితే శోభన్ బాబు తర్వాత టాలీవుడ్ లో నిర్మాతగా..క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా.. హీరోగా.. ఇండస్ట్రీలో పేరు తెచ్చుకున్న మురళీమోహన్ ధనవంతుడని చెబుతారు. ఇక మురళీ మోహన్ శోభన్ బాబు మాటలు వినే అలా భూములపైన తన డబ్బు ఇన్వెస్ట్ చేశారని ఆయన ఎన్నో ఇంటర్వ్యూలలో చెప్పారు. అయితే మరో హీరో సుమన్ కూడా శోభన్ బాబు ఆస్తుల గురించి మాట్లాడుతూ.. ఆయన అప్పట్లో ఎన్నో వందల ఎకరాల భూములు కొన్నారు.

Sobhan Babu sons have sold all their assets

ఇక చెన్నై పరిసర ప్రాంతాల్లో ఎక్కడ చూసినా కూడా అది శోభన్ బాబు భూమేనని అందరూ అనేవారు. అలా ఎన్నో చోట్ల ఆయన భూమిని కొన్నారు. ఇక అప్పుడు ఆయన భూమి 5000 పెట్టి కొంటే ఇప్పుడు దాని విలువ 50 కోట్ల వరకు అయ్యింది. అయితే ఇప్పుడు ఆయన సంపాదించిన ఆస్తి మొత్తం ఆయన కొడుకులు అలాగే ఉంచారో అమ్ముకున్నారో మాత్రం తెలియదు అంటూ హీరో సుమన్ ఆ ఇంటర్వ్యూలో శోభన్ బాబు ఆస్తుల గురించి చెప్పుకొచ్చారు. ఇక ఇది విన్న నెటిజన్స్ నిజంగానే శోభన్ బాబు ఎంతో జాగ్రత్తగా ఆస్తులు కూడబెట్టారు. కానీ ఆ ఆస్తులను వారి కుమారులు ఉంచుకున్నారో అమ్ముకున్నారో తెలియదు అని కామెంట్లు పెడుతున్నారు.(Sobhan Babu)

Join WhatsApp