Sreeleela Was Fixed As Heroine In Prabhas Movie

Prabhas: ఇటీవ‌ల స‌లార్ పార్ట్ 1తో హిట్ అందుకున్న పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ ప్ర‌స్తుతం చేతి నిండా సినిమాల‌తో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. స‌లార్ పార్ట్ 2, కల్కి 2898 ఏడీ, రాజా సాబ్ వంటి సినిమాలు చేస్తున్నాడు. అలాగే ప్ర‌భాస్ లైన‌ప్ లో సందీప్ రెడ్డి వంగా, హ‌ను రాఘ‌వ‌పూడి వంటి ద‌ర్శ‌కులు కూడా ఉన్నాయి. దుల్క‌ర్ స‌ల్మాన్ తో సీతారామం వంటి క‌ల్ట్ క్లాసిక్ ను తీసి పాన్ ఇండియా స్థాయిలో బిగ్ హిట్ అందుకున్న డైరెక్ట‌ర్ హ‌ను రాఘ‌వ‌పూడి త‌న నెక్స్ట్ ప్రాజెక్ట్ ను ప్ర‌భాస్ తో చేసేందుకు రెడీ అవుతున్నారు.

Sreeleela Was Fixed As Heroine In Prabhas Movie

వీరి కాంబో సినిమాపై అఫీషియ‌ల్ అనౌన్స్‌మెంట్ కూడా వ‌చ్చింది. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్ పై ఈ చిత్రం నిర్మితం కాబోతోంది. ప్రీ ప్రొడెక్ష‌న్ ప‌నులు ఆల్రెడీ ప్రారంభం అయ్యాయి. ప్రభాస్ ఇమేజ్ దృష్టిలో పెట్టుకుని హ‌ను రాఘ‌వ‌పూడి ఆయన ఓ ప్రేమకథ రెడీ చేశార‌ని ఇన్‌సైడ్ బ‌లంగా టాక్ న‌డుస్తోంది. తాజాగా ఈ మూవీకి సంబంధించి ఓ క్రేజీ న్యూస్ తెర‌పైకి వ‌చ్చింది.

అదేంటంటే.. ఈ చిత్రంలో ప్ర‌భాస్ స‌ర‌స‌న హీరోయిన్ గా న‌టించే బంప‌ర్ ఆఫ‌ర్ యంగ్ బ్యూటీ శ్రీ‌లీల‌ను వ‌రించింద‌ట‌. దర్శకుడు హను రాఘవపూడి కొద్ది రోజుల క్రిత‌మే శ్రీ లీలను స్వ‌యంగా కలిసి కథ మ‌రియు ఆమె పాత్ర గురించి వివ‌రించార‌ట‌. అయితే చ‌ర్చ‌లు కొన‌సాగుతున్నాయ‌ని.. ఆల్మోస్ట్ శ్రీ‌లీల క‌న్ఫార్మ్ అయిన‌ట్లే అని అంటున్నారు. శ్రీ‌లీల సంత‌నం చేయ‌డ‌మే ఇంకా మిగిలి ఉంద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి.(Prabhas)

Also Read: Shraddha Das: ఆ హీరోయిన్ న‌న్ను చిత‌క‌బాదింది.. 30 గాయాలతో హాస్ప‌ట‌ల్‌లో చేరానంటూ శ్రద్ధా దాస్ ఆవేద‌న‌!

కాగా, శ్రీ‌లీల ప్ర‌స్తుతం మంచి ఫామ్‌లో ఉన్న సంగ‌తి తెలిసిందే. గ‌త ఏడాది స్వంద‌, భ‌గ‌వంత్ కేస‌రి, ఆదికేశ‌వ‌, ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ వంటి సినిమాలు వ‌చ్చాయి. అలాగే ఈ ఏడాది ఆరంభంలో గుంటూరు కారంతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించింది. ఇందులో మ‌హేష్ బాబుకు జోడీగా అల‌రించింది. మిక్స్డ్ టాక్ తోనే గుంటూరు కారం భారీ వ‌సూళ్ల‌ను సాధించింది. ఇప్పుడు శ్రీ‌లీల చేతిలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ ఉంది. ప్ర‌భాస్ సినిమా చర్చ‌ల ద‌శ‌లో ఉంది. డార్లింగ్ తో న‌టించే ఛాన్స్ ద‌క్కితే శ్రీ‌లీల న‌క్క తోక తొక్కిన‌ట్లే అవుతుంది. (Prabhas)

Join WhatsApp