Ravi Teja's Impact in Tollywood

Star Hero: సాధారణంగా మన టాలీవుడ్ కి ఎంతోమంది దర్శకులు వస్తూ ఉంటారు. ఇక హీరోలు అయితే తమకి హిట్ పడాలని క్రమంలో స్టార్ డైరెక్టర్ లని మాత్రమే ఎంచుకుంటూ ఉంటారు. ఇక మరి కొంతమంది హీరోలు మాత్రం నూతన దర్శకులకి అవకాశం ఇస్తూ వారిని కూడా పెద్ద ఎత్తుకి ఎదిగేందుకు సహాయం చేస్తారు. ఇక మన టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ దర్శకులని పరిచయం చేసిన ఘనత ని ఓ స్టార్ హీరో సొంతం చేసుకున్నాడు.

Star Hero Ravi Teja’s Impact in Tollywood

మరి ఆ స్టార్ హీరో ఎవరో.. ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది. అదేనండి మనం మాస్ మహారాజ్ రవితేజ. ఎన్నో సినిమాలలో నటించిన రవితేజ మంచి పాపులారిటీని దక్కించుకున్నాడు. ఇక తాజాగా ” టైగర్ నాగేశ్వరరావు ” సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చి సూపర్ డూపర్ హిట్ ని సొంతం చేసుకున్నాడు. ఇక రవితేజ తాజాగా నటిస్తున్న మూవీ ” ఈగిల్ “.

Also Read: Hero Karizma CE001: అదిరే ఫీచర్స్ తో.. హీరో మోటోకార్ప్‌ నుంచి కరిజ్మా CE స్పెషల్‌ ఎడిషన్‌…!

ఈ సినిమాపై రవితేజ అభిమానులతో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక సంక్రాంతి బరిలో రిలీజ్ అవ్వాల్సిన ఈ మూవీ అనుకోని కారణాల చేత ఫిబ్రవరి 9 కి పోస్ట్ పోన్ అయ్యింది. ఇక నూతన దర్శకులకి రవితేజ బెస్ట్ ఛాయిస్ అని చెప్పవచ్చు. ఎంతోమంది స్టార్ డైరెక్టర్ లని ఇండస్ట్రీకి ఇచ్చాడు రవితేజ. కొత్త దర్శకుడు అంటే పెద్దగా ఎవరు సినిమా చూడరు అనే ఫీలింగ్ కూడా లేకుండా తన సహాయం కోసం వచ్చిన ప్రతి దర్శకుడికి తన వంతు సహాయం చేశాడు. ఇక టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్లని పరిచయం చేసిన ఘనతని సొంతం చేసుకున్నాడు.

Ravi Teja's Impact in Tollywood

ఇక రానున్న రోజుల్లో మరి కొంతమందిని ఇండస్ట్రీకి పరిచయం చేసి పెద్ద ఎత్తున పాపులారిటీ సంపాదించుకుంటాడని చెప్పవచ్చు. ఇక ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ క్రమంలోనే.‌.” రవితేజ అంటేనే అందరిలో ఒకడు. ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా వెళ్లాడు కాబట్టి.. విలువ తెలుసుకుని నూతన దర్శకులకి అవకాశాలు ఇస్తున్నాడు. మేము మీ ఫ్యాన్స్ అని చెప్పుకోవడానికి చాలా గర్వపడుతున్నాము అన్న ” అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు రవితేజ ఫ్యాన్స్.(Star hero)

Join WhatsApp