Star hero warning to Chiranjeevi director

Chiranjeevi : సినిమా ఇండస్ట్రీలో నటీనటుల మధ్య ఈర్ష్యలు, ద్వేషాలు ఉండడం సర్వసాధారణం. ఎందుకంటే ఏ రంగమైనా సరే ఒకరు ఎదుగుతున్నారంటే వారిని తొక్కేయాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇక ఇదంతా పక్కన పెడితే సినీ ఇండస్ట్రీలో కూడా ఇలాంటి ఈర్ష్య ద్వేషాలు చాలామంది నటీనటుల మధ్య ఉండే ఉంటాయి.

Star hero warning to Chiranjeevi director

అయితే టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచు ఫ్యామిలీకి మెగా ఫ్యామిలీకి అసలు పడదని, ప్రతిసారి రూమర్స్ చక్కర్లు కొడుతూనే ఉంటాయి. అయితే గతంలో వీరిద్దరి సినిమాల మధ్య చాలా పోటీ ఉండేది.అయితే వీరిద్దరూ సినిమాలు చేసే సమయంలో ఎన్నో గొడవలు జరిగేవంటూ అప్పట్లో కొన్ని వార్తలు మీడియాలో వినిపించేవి. అంతేకాదు ఇప్పటికి కూడా చాలామంది సీనియర్ యాక్టర్స్ వీరి మధ్య ఉండే గొడవలను అప్పుడప్పుడు బయట పెడుతూ ఉంటారు.(Chiranjeevi )

Also Read: Shanmukh Jaswanth: బిగ్ బ్రేకింగ్‌.. డ్రగ్స్ కేసులో ప్రముఖ యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్ అరెస్ట్‌!!

అయితే గతంలో మోహన్ బాబు స్టార్ డైరెక్టర్ రాఘవేంద్రరావుకి కాల్ చేసి చిరంజీవితో ఇంకోసారి సినిమాలు చేస్తే చంపేస్తా అంటూ వార్నింగ్ ఇచ్చారట. మరి ఎందుకు అలా ఇవ్వాల్సి వచ్చింది అనే సంగతి చూస్తే.. చిరంజీవికి రాఘవేంద్రరావు ఎన్నో బ్లాక్బస్టర్ సినిమాలు ఇచ్చారు. అయితే ఓసారి రౌడీ అల్లుడు అనే సినిమా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో ఈ సినిమా రిలీజ్ అయి హిట్ టాక్ వచ్చిన వెంటనే రాఘవేంద్రరావుకి మోహన్ బాబు కాల్ చేసి మంచి సినిమాలు అన్ని ఆయనకే ఇస్తారా..

Star hero warning to Chiranjeevi director

ఆయనతోనే మంచి సినిమాలు చేస్తారా.. నాతో చేయరా.. నాకు ఓ మంచి సినిమా ఆఫర్ ఇవ్వకపోతే మాత్రం చంపేస్తా అంటూ ఫన్నీగా వార్నింగ్ ఇచ్చారట. ఇక మోహన్ బాబు ఇలా మాట్లాడాక కొద్ది రోజులకే రాఘవేంద్రరావు మోహన్ బాబు కాంబినేషన్లో మేజర్ చంద్రకాంత్ అనే బ్లాక్ బస్టర్ మూవీ వచ్చిన సంగతి మనకు తెలిసిందే.(Chiranjeevi )

Join WhatsApp