Sudheer who is finally ready for marriage

Sudheer: జబర్దస్త్ షో ద్వారా కమెడియన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించిన సుధీర్ ఈ షో ద్వారా సుడిగాలి సుధీర్ గా మారిపోయారు. కేవలం ఈ షోలో కమెడియన్ గానే కాకుండా ఎన్నో సినిమాల్లో హీరోల పక్కన సైడ్ క్యారెక్టర్స్ చేశారు.అంతేకాకుండా సుధీర్ ని హీరోగా పెట్టి కూడా చాలా సినిమాలు తీశారు.ఇక సుధీర్ చేసిన సినిమాలు చాలా వరకు హిట్ అవ్వడంతో ప్రస్తుతం సుదీర్ జబర్దస్త్ షోలో కమెడియన్ గా మానేసి పూర్తిగా సినిమాల్లోనే బిజీ గా ఉన్నారు.

Sudheer who is finally ready for marriage

అయితే అలాంటి సుధీర్ పేరు వినిపిస్తే అందరికీ గుర్తుకు వచ్చేది రష్మీ కూడా.. జబర్దస్త్ షోలో రష్మీ సుధీర్ లను పెట్టి లవ్ ట్రాక్ నడిపిస్తూ చాలావరకు షోని హిట్ చేశారు..అంతేకాదు ఏదైనా పండగకి సంబంధించిన ఈవెంట్లు చేస్తే కచ్చితంగా రష్మీ సుధీర్ లు ఉండాల్సిందే.ఇక వెండితెరపై చాలామంది సెలబ్రిటీ జంటలకు ఎంత గుర్తింపు వచ్చిందో అంతకంటే ఎక్కువగా సుధీర్, రష్మీ ల జంటకు గుర్తింపు వచ్చింది.(Sudheer )

Also Read: Srinivas Avasarala: రాశి ఖన్నా కారులో పక్కన కూర్చుంటే అలా చేసింది.. ఇంకెప్పుడూ ఆమె కారు ఎక్కను..!

అయితే వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలని ఎంతోమంది వీరి అభిమానులు కోరుకున్నప్పటికీ అది కేవలం తెరమీద మాత్రమే వీరు సాన్నీహిత్యంగా ఉంటారు కానీ తెరవెనక కాదు అనే విషయాన్ని చాలా సార్లు బయటపెట్టారు. అయితే తాజాగా సుదీర్ పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అయితే ఇప్పటికే సుధీర్ పెళ్లి గురించి ఎన్నో వార్తలు నెట్టింట్లో చక్కర్లు కొట్టినప్పటికీ ప్రస్తుతం ఈ వార్త మాత్రం ఇండస్ట్రీలో కొంతమంది సుధీర్ సన్నిహితులు లీక్ చేసినట్టు టాక్.

Sudheer who is finally ready for marriage

అదేంటంటే సుధీర్ వచ్చే ఏడాది సమ్మర్ లో పెళ్లి చేసుకోబోతున్నారట. అది కూడా తమ బంధువుఅమ్మాయినని తెలుస్తోంది. సుధీర్ కి దూరపు బంధువయిన వరసకి మరదలు అయ్యే ఓ అమ్మాయి ప్రస్తుతం ఫారిన్లో చదువుకుంటుందట.ఇక ఆమె చదువు వచ్చే సంవత్సరంకల్లా పూర్తవబోతున్నట్టు తెలుస్తోంది. ఇక చదువు పూర్తయ్యాక సరిగ్గా సంవత్సరానికి అంటే వచ్చే ఏడాది సమ్మర్లో వీరి పెళ్లి జరగబోతున్నట్టు టాక్ వినిపిస్తోంది.అయితే సుధీర్ పెళ్లి నిజంగానే జరగబోతుందా లేదా ఇది కూడా రూమరేనా అనేది తెలియాల్సి ఉంది.(Sudheer )

Join WhatsApp