Sudhir Sudhir in support of Pawan Kalyan

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.‌. ఈ పేరు ఈ పేరును విన్న వెంటనే గూస్బంస్ వస్తూ ఉంటాయి. ఈయ‌న‌ పేరు మొన్నటివరకు ఒక్క సినీ ఇండస్ట్రీలోనే వినిపించేది. కానీ ఇప్పుడు పాలిటిక్స్ లో కూడా గట్టిగా మారుమోగుతుంది. ఎవరికైనా ఓ సినిమా లేదా రెండు సినిమాలు ఫ్లాప్ అయితే డైరెక్టర్లు వారితో సినిమాలు చేయడానికి కొంచెం ఆలోచిస్తారు. కానీ పవన్ విషయంలో దానికి రివర్స్ గా జరుగుతుంది. కథ ఎలా ఉన్నా అందులో పవన్ కళ్యాణ్ నటిస్తే మాక్సిమం మినిమం కలెక్షన్స్ రాబడతాయి. ఆ పోస్టర్ పై పవన్ కళ్యాణ్ అనే ఒక పేరును చూసి సినిమాకి వెళ్లేవారు ఎందరో ఉన్నారు.

Sudhir Sudhir in support of Pawan Kalyan

అంత అభిమానం మరి పవన్ కళ్యాణ్ అంటే తన ఫ్యాన్స్ కి. అటువంటి పవన్ కళ్యాణ్ కి నోర్మల్ ఫాన్సీ కాదు సినీ ఇండస్ట్రీలో కూడా వీరాభిమానులు ఉన్నారు. వారిలో కొందరు కమీడియన్స్ అయితే మరి కొందరు హీరో మరియు హీరోయిన్స్ ఉన్నారు. ఇలా ఎంతోమంది నటీనటులు పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ గా నిలబడ్డారు. ఇక ప్రస్తుతం పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ లో ఫుల్ బిజీగా ఉన్నాడు. పిఠాపురం ఎమ్మెల్యేగా నిలబడ్డ పవన్ తన విజయం పక్క అంటూ తగేసి చెబుతున్నాడు.

Also Read: Varalakshmi Sarathkumar: నేను స్టార్ అవ్వాలని ఇండస్ట్రీకి రాలేదు?.. ఇండస్ట్రీ రాకపై కామెంట్స్ చేసిన వరలక్ష్మి శరత్ కుమార్..!

ఇక పవన్ కళ్యాణ్ ని గెలిపించేందుకు తన కుటుంబ సభ్యులతో పాటు తనని అభిమానించే నటీనటులు కూడా ముందుకు వస్తూ ప్రచారంలో పాల్గొంటున్నారు. ఈతరణంలోనే జబర్దస్త్ ద్వారా కెరీర్ స్టార్ట్ చేసి అనంతరం హీరోగా మంచి గుర్తింపును సంపాదించుకున్న సుడిగాలి సుదీర్ సైతం ప్రసారంలో పాల్గొన్నారు. నిజానికి సుడిగాలి సుదీర్ కి పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టం. ఆ ఇష్టంతోనే జనసేన తరఫున పిఠాపురం లో ప్రచారం జరిపిస్తున్నాడు సుధీర్.

Sudhir Sudhir in support of Pawan Kalyan

ఇక ఇప్పటికే జబర్దస్త్ కమెడియన్ అయినా ఆది సైతం పలు చోట్ల ప్రచారం చేపట్టాడు. ఇక ఇప్పుడు సుడిగాలి సుదీర్ తో పాటు.‌.. జబర్దస్త్ కమెడియన్స్ శ్రీను కూడా ఈ ప్రచారంలో పాల్గొన్నాడు. వీరిద్దరూ కలిసి పిఠాపురంలో పవన్ కోసం ప్రచారం చేపట్టారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక ఈ వీడియో చూసిన పలువురు పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ తనకున్న పనులను వదులుకుని ఇలా పవన్ కళ్యాణ్ కోసం ప్రచారం చేయడం అంటే మామూలు విషయం కాదానే చెప్పుకోవచ్చు.(Pawan Kalyan)

Join WhatsApp