Sukumar Daughter Beautiful Pics Goes On Viral

Sukumar: టాలీవుడ్ లో ఉన్న స్టార్ డైరెక్ట‌ర్స్ లో సుకుమార్ ఒక‌రు. కాకినాడ‌లోని ఓ కాలేజీలో లెక్చ‌ర‌ర్‌గా కెరీర్ స్టార్ట్ చేసిన సుకుమార్‌.. ఆ త‌ర్వాత సినిమా ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చారు. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండానే డైరెక్ట‌ర్ గా నిల‌దొక్కుకున్నాడు. స్టార్ స్టేట‌స్‌ను అందుకున్నారు. టాప్ హీరోల‌కు మోస్ట్ వాంటెడ్ ద‌ర్శ‌కుడిగా మారిపోయారు. పుష్ప: ది రైజ్ తో పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకున్న సుకుమార్.. ప్ర‌స్తుతం పుష్ప 2 మూవీతో బిజీగా ఉన్నాడు.

Sukumar Daughter Beautiful Pics Goes On Viral

అయితే ద‌ర్శ‌కుడిగా సుకుమార్ అంద‌రికీ సుప‌రిచిత‌మే. కానీ, అత‌ని ఫ్యామిలీ విష‌యాల గురించి పెద్ద‌గా ఎవ‌రికీ తెలియ‌దు. సుకుమార్ భార్య పేరు త‌బిత‌. వీరిది ప్రేమ వివాహం. ఆర్య రిలీజ్ సమయంలో హైద్రాబాద్ లోని సుదర్శన్ థియేటర్ కు వెళ్లిన సుకుమార్ కు త‌బిత తార‌స‌ప‌డింది. తొలి చూపులోనే ఆమెతో ప్రేమ‌లో ప‌డ్డాడు. త‌మిత‌ ఆటోగ్రాఫ్ అడిగితే సుకుమార్ ఏకంగా ఫోన్ నెంబ‌ర్ ఇచ్చారు.

Sukumar Daughter Beautiful Pics Goes On Viral

అలా సుకుమార్ తో ప‌రిచ‌యం ఏర్ప‌డిన కొద్ది రోజుల‌కే త‌మిత కూడా ల‌వ్ లో ప‌డ్డింది. వీరి వివాహానికి సుకుమార్ త‌ర‌ఫు వారు అంగీక‌రించినా.. త‌బిత త‌ల్లి దండ్రులు ఒప్పుకోలేదు. అయినప్ప‌టికీ 2009లో ఇద్ద‌రూ వివాహం చేసుకున్నారు. ఈ దంప‌తుల‌కు సుకృతి వేణి అనే కూతూరు మ‌రియు సుక్రాంత్ అనే కుమారుడు జ‌న్మించారు. అయితే సుకుమార్ కూతురు సుకృతి ఫోటోలు తాజాగా బ‌య‌ట‌కు వ‌చ్చాయి.(Sukumar)

Also Read: Honey Rose: ఎట్ట‌కేల‌కు తెలుగులో సినిమా ద‌క్కించుకున్న హ‌నీ రోజ్‌.. ఆ స్టార్ హీరోతో హాట్ బ్యూటీ!?

రీసెంట్ గా సుకృతి బ‌ర్త్‌డే సెల‌బ్రేష‌న్స్ గ్రాండ్ గా జ‌రిగాయి. ఇందుకు సంబంధించిన ఫోటోల‌ను త‌మిత సోష‌ల్ మీడియాలో పంచుకున్నారు. ఈ పిక్స్ లో సుకృతిని చూసి నెటిజ‌న్లు చూపు తిప్పుకోలేక‌పోతున్నారు. హీరోయిన్ల‌కు ఏ మాత్రం తీసిపోని విధంగా ఉంద‌ని కొంద‌రు అంటుంటే.. మ‌రికొంద‌రు సుకృతి ముందు హీరోయిన్లు కూడా దిగ‌దుడుపే అని కామెంట్లు చేస్తున్నారు. ప్ర‌స్తుతం టీనేజ్ లో ఉన్న సుకృతి త‌న అందంతో అంద‌రినీ ఎంత‌గానో ఎట్రాక్ట్ చేస్తోంది. మ‌రి సుకుమార్ కూతురిగా సుకృతి ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చే అవ‌కాశం ఉందా.. లేదా.. అన్న‌ది తెలియాల్సి ఉంది.

Join WhatsApp