Sukumar who has selected the hero for the next movie

Sukumar: ప్రెసెంట్ టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం మాట్లాడుకునే ఏకైక డైరెక్టర్ సుకుమార్. ఒకప్పుడు సుకుమార్ అంటే పెద్దగా ఎవ్వరికీ తెలియదు. కానీ ప్రస్తుత కాలంలో మాత్రం ఒక్క టాలీవుడ్ అనే కాదు బాలీవుడ్, హాలీవుడ్ లో కూడా తన పేరును ట్రెండింగ్ లో ఉంచాడు. ఇందుకు కారణం తన డైరెక్షనే. ఈయన తెరకెక్కించిన పుష్ప మూవీ ఎంతటి సంచలనం సృష్టించిందో మనందరికీ తెలిసిందే.

Sukumar who has selected the hero for the next movie

ఈ సినిమాతోనే అల్లు అర్జున్కి కూడా పాన్ ఇండియా పాపులారిటీ దక్కింది. ఇక ప్రస్తుతం పుష్ప టు తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ మూవీకి మరో సీక్వెల్ కూడా ఉండబోతుందని గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. నిజానికి పుష్ప మూవీని మొదట వెబ్ సిరీస్ కింద తీద్దామని అనుకున్నాడట సుకుమార్. కానీ బన్నీ వంటి హీరోలతో చేసేటప్పుడు వెబ్ సిరీస్ అయితే ఏం బాగుంటుంది అని ఆలోచించి సినిమా కింద రూపొందించాడట.

Also Read: Prabhas: అమ్మ దినమ్మ.. ప్రభాస్ పెళ్లి చేసుకోకపోవడానికి అసలు రీజన్ ఇదా?… ఫ్యాన్స్ కి గట్టిగానే క్లారిటీ ఇచ్చాడుగా..!

ఇక అలా రూపొందించిన సినిమా కాస్త నేషనల్ వైడ్ గా రికార్డులు బ్రేక్ చేసింది. ఈ మూవీలో బన్నీ నటనకు గాను నేషనల్ అవార్డు సైతం దక్కింది. ఇక రీసెంట్ గా సోషల్ మీడియాలో ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ గా మారింది. పుష్ప మూవీ అనంతరం సుకుమార్ ఏ హీరోని డైరెక్ట్ చేయబోతున్నాడు అన్న విషయంపై తాజాగా ఓ రూమర్ వినిపిస్తుంది.

Sukumar who has selected the hero for the next movie

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం సుకుమార్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో పుష్ప అనంతరం ఓ సినిమా రూపొందించనున్నట్లు తెలుస్తుంది. ప్రెసెంట్ గేమ్ చేంజర్ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న చెర్రీ అనంతరం బుచ్చిబాబు దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు. ఆ తరువాత వెంటనే ఈ మూవీ షూటింగ్ మొదలుపెట్టనున్నట్లు తెలుస్తుంది. ఒకపక్క పాన్ ఇండియా హీరో.. మరో పక్క కూడా పాన్ ఇండియా డైరెక్టర్. వీరిద్దరూ కలిసి పనిచేస్తే ఆ సినిమా పక్క బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. ఇక ఈ కాంబినేషన్ ఎప్పుడు అనౌన్స్ చేస్తారో చూడాలి.(Sukumar)

Join WhatsApp