Suman revealed the true nature of Rajinikanth

Rajinikanth: హీరోగా ఒకప్పుడు ఎన్నో సినిమాల్లో ఓ వెలుగు వెలిగిన సుమన్ ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారిపోయారు. అయితే ఈయన ఒకానొక దశలో మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్,నందమూరి బాలకృష్ణ,అక్కినేని నాగార్జున వంటి హీరోల సినిమాలకు పోటీగా నిలిచారు.అంతేకాదు ఒకానొక దశలో ఈ హీరోల సినిమాల కంటే ఎక్కువగా సుమన్ సినిమాలే ఆడాయి.అలా ఈయన అందం అభినయంతో ఎంతోమంది లేడీ అభిమానులను ఆకర్షించారు. అయితే అలాంటి సుమన్ రీసెంట్ గా పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో రజినీకాంత్ నిజ స్వరూపం మొత్తం బయటపెట్టారు.

Suman revealed the true nature of Rajinikanth

ఇక ఈ విషయం తెలిసిన చాలా మంది జనాలు రజనీకాంత్ గురించి అసలు నిజం ఇదా అంటూ నోరెళ్ళబెడుతున్నారు.ఇంతకీ అసలు విషయం ఏమిటంటే.. రజినీకాంత్ హీరోగా చేసిన శివాజీ మూవీ లో సుమన్ విలన్ గా చేశారు.అయితే ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో ఓసారి షూటింగ్ లేట్ అవుతుంది అని తెలియడంతో రజినీకాంత్ సుమన్ ఒక్కడినే తన వెంటబెట్టుకొని వెళ్లి ఒక ప్రదేశానికి తీసుకువెళ్లి కార్ అక్కడే ఆపేసి గతంలో నా నిజ జీవితం ఇది..(Rajinikanth)

Also Read: Comedian Sunil: కమెడియన్ సునీల్ కెరీర్ సంక నాకి పోవడానికి కారణం ఇదా?.. బయటపడ్డ టాప్ సీక్రెట్..!

నేను బస్ కండక్టర్గా పని చేస్తున్న సమయంలో నా డ్యూటీ అయిపోయాక నేను తాగే సిగరెట్,మందు ఖర్చులు భరించడం కోసం ఇక్కడ మూటలు మోసే వాడిని.ఇలా మూటలు మోయగా వచ్చిన డబ్బుతో సిగరెట్లు,మందు కొనుక్కొని తాగేవాడిని అంటూ ఎవరికి తెలియని ఒక నిజాన్ని సుమన్ కి చెప్పారట. ఈ విషయం చెప్పగానే సుమన్ ఒకింత ఆశ్చర్యానికి గురై అంత పెద్ద హీరో ఇక్కడ పని చేశారా అని నోరెళ్ళబెట్టారట. ఇక ఈ విషయాన్ని సుమన్ ఓ ఇంటర్వ్యూలో స్వయంగా బయట పెట్టారు.

Suman revealed the true nature of Rajinikanth

అంతేకాదు రజినీకాంత్ ప్రతిరోజు ఇంట్లో కచ్చితంగా మద్యపానం సేవించే పడుకుంటారని,ఆ సమయంలో ఎవరైనా అక్కడికి వెళ్తే మాత్రం వారిని ఒక పెగ్గు తాగమని అస్సలు అడగరట.ఎందుకంటే మందు తాగడం వల్ల నా లంగ్స్ నా లివర్ పాడవుతుంది.కానీ ఈ మందు తాగమని మిమ్మల్ని ఎంకరేజ్ చేసి మీ ఊపిరితిత్తులు, కాలేయం పాడవడానికి నేను కారణం కాకూడదు.అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్ నన్ను తిట్టుకోకూడదు. అందుకే నేను మిమ్మల్ని మందు తాగమని ఎంకరేజ్ చేయను అని చెప్పేవారు అంటూ సుమన్ రజినీకాంత్ గురించి ఒక సీక్రెట్ విషయాన్ని బయటపెట్టారు.(Rajinikanth)

Join WhatsApp