Suma's Anchoring Range

Suma: మన టాలీవుడ్ యాంకర్లలో ప్రెస్ మీట్ కి కానీ ఏదైనా షో చేయాలన్న ముందుగా గుర్తుకు వచ్చేది సుమ కనకాల. స్టార్ సినిమాల ఫంక్షన్స్ కి బెస్ట్ చాయిస్ సుమ అని చెప్పవచ్చు. అంతటి పాపులారిటీని దక్కించుకుంది మరి సుమ. మన టాలీవుడ్ లో ఎంతోమంది యాంకర్లు ఉన్నప్పటికీ ప్రతి ఒక్కరు సుమానే ఎంచుకుంటారు.

Suma’s Anchoring Range

ఈమె యాంకరింగ్ కి ఆ రేంజ్ ఫాలోయింగ్ ఉంది మరి. ఒకపక్క స్టార్ హీరోల సినిమాల ఫంక్షన్స్ కి యాంకరింగ్ చేస్తూనే మరో పక్క సుమ అడ్డ షో కి యాంకరింగ్ చేస్తుంది సుమ. ఇక ఈ షో కి విచ్చేసిన ప్రతి ఒక్క యాక్టర్ ని కూడా నవ్విస్తూ తెగ హడావిడి చేస్తూ ఉంటుంది సుమ. ఇక తాజాగా ఈ సినిమాకి సోహెల్ హాజరయ్యాడు. ఈ క్రమంలోనే సుమ మంచితనం గురించి బయట పెట్టాడు. సోహెల్ మాట్లాడుతూ..” నేను నా సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ కి సుమా గారితో మాట్లాడాను.

Also Read: Tamannaah: ఫైన‌ల్ గా పెళ్లికి గ్రీన్ సిగ్న‌ల్‌.. అలా హింట్ ఇచ్చేసిన మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా!

సుమా గారు కూడా ఓకే చెప్పారు. ఇక ఆ తరువాత నేను ఒకసారి సుమా గారికి ఫోన్ చేస్తే తన అసిస్టెంట్ లిఫ్ట్ చేశారు. నేను స్టార్ హీరోల రేంజ్ లో డబ్బులు ఇవ్వలేను కొంచెం తక్కువ ఇస్తానని సుమా గారికి చెప్పండి అని చెప్పాను. ఇక అనంతరం సుమా గారు వచ్చిన తర్వాత నాకు ఫోన్ చేశారు. నేను ఇలా ఎక్కువ డబ్బులు ఇవ్వలేను అండి అని అన్నాను.. దానికి సుమా గారు.. నువ్వు నా కొడుకు లాంటి వాడివి అమ్మ.

Suma's Anchoring Range

నేను ఇంత పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నది మీలాంటి వారికి అండగా నిలబడడానికి. మీ అందరికీ నేనెప్పుడూ సపోర్ట్ గా ఉంటాను. నీ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి నేను ఒక్క రూపాయి కూడా తీసుకోను.. ఫ్రీగా చేసి పెడతా .. అని నా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఫ్రీగా చేశారు సుమా గారు ” అంటూ చెప్పుకొచ్చాడు సోహిల్. ఇక దీంతో సుమ గొప్పతనం మరోసారి బయటపడింది. ఇక ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.(Suma)

Join WhatsApp