Sunil made sensational comments about Chiranjeevi's politics

Sunil: టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి కమెడియన్ గా ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత హీరోగా.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా.. ప్రస్తుతం విలన్ గా కూడా సునీల్ తన అదృష్టాన్ని పరీక్షించుకొని ఎలాంటి పాత్రనైనా సరే అవలీలగా చేయగలుగుతున్నారు. అయితే అలాంటి సునీల్ తాజాగా చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Sunil made sensational comments about Chiranjeevi’s politics

చిరంజీవి రాజకీయాల్లో అందుకే సక్సెస్ అవ్వలేదు అంటూ సునీల్ చేసిన వ్యాఖ్యలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. సునీల్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నేను చిరంజీవి అన్నయ్యను ఇన్స్పైరింగ్ గా తీసుకొని సినిమాల్లోకి వచ్చాను.ఆయన నాకు చేసినంత సహాయం నేను నా జీవితంలో ఎవరికి చేయను కావచ్చు. అంత సహాయం అందించారు.(Sunil)

Also Read: Kriti Shetty: చేసింది కొన్ని సినిమాలే.. కానీ ఆస్తులు మాత్రం బాగానే కూడబెట్టింది.. ఎంతంటే.?

అయితే సినిమాల్లో సక్సెస్ అయినంతగా రాజకీయాల్లో సక్సెస్ కాలేదు ఆయన.ఇక సినిమాల్లో ఆయన ఎవరి అండదండలు లేకుండానే నెంబర్ 1 పొజిషన్లో ఉన్నారు. నా దృష్టిలో మాత్రం ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చిన చిరంజీవి గారే నెంబర్ 1. అయితే ఆయనకు రాజకీయాలు కలిసి రాలేదు.ఆయన సినిమాల్లో ఉన్నప్పుడే చాలామందికి సహాయం చేశారు. ఇక రాజకీయాల్లోకి వచ్చి కూడా పేద ప్రజలకు సహాయం అందించాలి అనుకున్నారు.

Sunil made sensational comments about Chiranjeevi's politics

కానీ రాజకీయాలు అంటే ఒకరి చేతిలో ఉండవు. పది మంది మీద ఆధారపడాల్సి వస్తుంది.రాజకీయాల్లో సక్సెస్ అవ్వాలంటే ఎన్నో అంశాలను ఎంతోమందిపై ఆధారపడి ఉండాలి. రాజకీయాల్లో ఒక్కరు తప్పుడు దారిలో నడిచినా కూడా ఆ నింద అందరిపై పడుతుంది. అలా చిరంజీవి చుట్టూ రాంగ్ స్టెప్ వేయడం వల్ల చిరంజీవి గారికి ఇబ్బంది తలెత్తింది. అందుకే ఆయన రాజకీయాల్లో సక్సెస్ కాలేకపోయారు అంటూ చిరంజీవి రాజకీయాల గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు సునీల్.(Sunil)

Join WhatsApp