Suprita Vani bold comments

Suprita Vani: టాలీవుడ్ సీనియర్ ఆర్టిస్ట్ సురేఖ వాణి గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. తరచూ బోల్డ్ ఫోటోలు మరియు వీడియోలని షేర్ చేస్తూ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. ఇక ఈమె చేసే చేష్టలు చాలా అన్నట్లు తన కూతురిని కూడా ఆ విధంగానే తయారు చేసింది.

Suprita Vani bold comments

సురేఖ వాణి కుమార్తె సుప్రీత వాణి సైతం బోల్డ్ కంటెంట్తో ప్రేక్షకుల ముందుకి వస్తువు ‌ బీభత్సంగా ట్రోల్స్ కి గురవుతుంది. కుర్రాల నుంచి ముసలి వారు సైతం వీరి అందాల ఆరబోతకు ఫిదా అవ్వాల్సిందే. ఏక సురేఖ వాణి కుమార్తె సుప్రీత ను ఇండస్ట్రీ వైపు తీసుకొచ్చిన విషయం తెలిసిందే. బిగ్బాస్ ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకున్న అమర్ దీప్ హీరోగా నటిస్తున్న మూవీలో సుప్రీతా కథానాయకగా ఎంపికైంది.

Also Read: Mahesh Babu: పోకిరి మూవీ లో ప్రకాష్ రాజ్ లవర్ గుర్తుందా?.. ఇప్పుడు చూడండి ఎలా మారిపోయిందో..!

ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ సర్వేగంగా జరుగుతుంది. ఇకపోతే తాజాగా ఈ బ్యూటీ ఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. యాంకర్ సుప్రీతతో హాజరైన రామచంద్ర అంటే ఇద్దరు అమ్మాయిలకు క్రష్ అని చెప్పడంతో ఆయన మీసాలు తిప్పుతూ లేచిపోయాడు. మరి ఆ ఇద్దరు భామలు ఎవరిని అడగగా.. ఒకరు కుషిత అని చెబుతుంది రీతు.

Suprita Vani bold comments

ఆయన లాంటి అబ్బాయి కావాలని.. రామచంద్ర మొగుడిలా అనిపిస్తాడని.. మొగుడైతే బాగుండు అని కుషిత చెప్పినట్లు రీతు తెలిపింది. ఇక మరో అమ్మాయి సుప్రీత అని చెప్పగా.. అవును నా క్రష్ శ్రీరామ్ చంద్ర అని తెలిపింది. నువ్వు సింగిలా? అని రీతు అడగగా.. అవును నేను సింగిలే.. ఎవరైనా ట్రై చేసుకోవచ్చు అని ఫన్నీగా చెప్పడంతో అక్కడున్న వారంతా షాక్ అయ్యారు. ప్రస్తుతం ఈ బోల్డ్ బ్యూటీ కామెంట్స్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి.(Suprita Vani)

Join WhatsApp