Surekha who cheated the star heroine

Surekha: చిరంజీవి భార్య సురేఖ గారు నిజంగానే ఆ హీరోయిన్ ని భర్త పేరు చెప్పుకొని మోసం చేసిందా? అలాంటి ఫోటోలు పంపమని డైరెక్ట్ గానే అడిగిందా.. మరి ఇంతకీ సురేఖ చేతిలో మోసపోయిన ఆ హీరోయిన్ ఎవరు అనే సంగతి ఇప్పుడు తెలుసుకుందాం. మెగా కోడలుగా సురేఖ తన బాధ్యతలన్నీ ఎంతో చక్కగా నెరవేర్చుతుంది. చిరంజీవి హీరోగా నిలదొక్కుకుంటున్న సమయంలోనే మెగా ఫ్యామిలీలోకి కోడలుగా అడుగుపెట్టి తన ఇద్దరు మరుదులను,ఆడపడుచులను, అత్తమామలను ఎంతో ఆప్యాయంగా చూసుకునేది.

Surekha who cheated the star heroine

అంతేకాదు సురేఖ ఒక మాట చెబితే చిరంజీవి ఇంట్లో నుండి వేరుపడి తన దారి తను చూసుకునేవాడు. కానీ అల్లు ఫ్యామిలీ లాంటి గౌరవప్రదమైన ఫ్యామిలీ నుండి రావడంతో ఈమెకు అలాంటి లక్షణాలు రాలేదు.ఇక సురేఖకు ఉన్న ఓపిక సహనం వల్లనే వారి కుటుంబం ఎన్ని రోజులైనా ముక్కలు కాలేదు అని అంటూ ఉంటారు.అయితే పవన్ కళ్యాణ్ నీ సినిమాల్లో సెట్ చేయడం కోసం సురేఖనే ఎన్నో ఇబ్బందులు పడిందట. అంతే కాదు సురేఖ వల్లే పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి వచ్చాడన్న సంగతి కూడా ఎన్నో సందర్భాలలో ఆయన గుర్తు చేసుకున్నారు. అయితే సురేఖ ఓ హీరోయిన్ ని తన భర్త పేరు చెప్పి మోసం చేసిందట.(Surekha)

Also Read: Alia Bhatt: బెంచీలు తుడిచిన స్థాయి నుంచి స్టార్ హీరోయిన్ గా ఎదిగిన అలియా భ‌ట్ గురించి ఈ విష‌యాలు మీకు తెలుసా?

ఇక సురేఖ చేతిలో మోసపోయిన ఆ హీరోయిన్ ఎవరో కాదు ఒకప్పటి సీనియర్ నటి రాశి.. మరి ఇంతకీ అసలు విషయం ఏంటంటే..రాశి రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చిరంజీవి గారికి నేను పెద్ద ఫ్యాన్ న. అలాగే నేను ఆయన గ్యాంగ్ లీడర్ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేశాను. అలా నాకు ఆయనతో అనుబంధం ఉంది.ఇక ఓసారి సురేఖ గారు ముంబై వచ్చినప్పుడు మా నాన్నకి కాల్ చేసి చిరంజీవి గారు రమ్మంటున్నారని చెప్పారు. దాంతో నేను ఏం చేయాలో అర్థం కాక తొందరగా రెడీ అయి నా ఫోటో ఆల్బమ్ ఒకటి పట్టుకొని అక్కడికి వెళ్లాను.

Surekha who cheated the star heroine

కానీ అక్కడికి వెళ్లాకే నాకు అసలు విషయం అర్థమైంది.ఎందుకంటే నన్ను పిలిచింది చిరంజీవి గారు కాదు సురేఖ గారు.అది కూడా పవన్ కళ్యాణ్ సినిమా కోసం.పవన్ కళ్యాణ్ గోకులంలో సీత సినిమాలో హీరోయిన్ కోసం వెతుకులాడుతున్న సమయంలో రవిరాజా పినిశెట్టి గారు నా పేరు చెప్పడంతో సురేఖ గారు నన్ను రమ్మన్నారట.అలా ఆరోజు చిరంజీవి గారే పిలిచారని వచ్చి సురేఖ వల్ల నేను గోకులంలో సీత సినిమాలో హీరోయిన్ గా మారాను అంటూ ఆ ఇంటర్వ్యూలో రాశి చెప్పుకొచ్చింది. అలాగే నా ఫొటోస్ చూసి ట్రెడిషనల్ గా చాలా బాగున్నావు. కానీ వెస్ట్రన్ ఫొటోస్ కూడా నాకు పంపించు అని సురేఖ గారు అన్నారు అంటూ రాశి ఆ ఇంటర్వ్యూ లో చెప్పింది.(Surekha)

Join WhatsApp