Taapsee married secretly.. Photos viral

Taapsee: ఏంటి హీరోయిన్ తాప్సీ నిజంగానే సీక్రెట్ గా పెళ్లి చేసుకుందా..బాలీవుడ్ లో వైరల్ అవుతున్న న్యూస్ నిజమేనా.. అనేది ఇప్పుడు తెలుసుకుందాం.. సౌత్,నార్త్ లో హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న తాప్సీ పన్ను గత కొద్ది రోజులుగా మథియాస్ బోనూ అనే బ్యాడ్మింటన్ ప్లేయర్ తో ప్రేమలో ఉన్న సంగతి మనకు తెలిసిందే.అయితే తాప్సీ పన్ను ఈ నెల అంటే మార్చిలో పెళ్లి చేసుకోబోతున్నట్టు ఎన్నో వార్తలు మీడియాలో చక్కర్లు కొట్టాయి.

Taapsee married secretly.. Photos viral

అంతేకాదు రహస్యంగా తన పెళ్లి చేసుకోబోతుందని,తన పెళ్లికి ఎవరిని కూడా ఆహ్వానించడం లేదని, ఉదయపూర్ లో ప్రైవేట్ ఫంక్షన్ లాగా తన పెళ్లి జరగబోతుంది అంటూ వార్తలు వినిపించాయి. అయితే ఇప్పటి వరకు తాప్సి పన్ను కు సంబంధించిన పెళ్లి ఫోటోస్ ఒక్కటీ కూడా నెట్టింట వైరల్ అవ్వలేదు. కానీ తాజాగా బాలీవుడ్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం తాప్సి మథియాస్ బోనూ ల వివాహం మార్చి 23నే సీక్రెట్ గా జరిగిపోయిందట. వీరి పెళ్లి అందరూ ముందుగా అనుకున్నట్లే ఉదయపూర్ లో జరిగిందట. (Taapsee)

Also Read: Okkadu movie: అమ్మ దీనమ్మ… ఒక్కడు మూవీలో మహేష్ సిస్టర్ గుర్తుందా.. ఇప్పుడు చూడండి ఎలా తయారయిందో..?

అయితే వీరి పెళ్లికి కొంతమంది తనతో పని చేసిన వారిని మాత్రమే తాప్సి ఆహ్వానించిందట. అయితే తాజాగా వాళ్ళు తమ ఇంస్టాగ్రామ్ ఖాతాలో పెట్టిన ఫొటోస్ కారణంగా తాప్సీ పెళ్ళి జరిగిపోయినట్టు నెటిజెన్స్ క్లారిటీకి వచ్చారు. అయితే తాప్సీ తన పెళ్లికి అనురాగ్ కష్యప్ , కనిక ధిల్లాన్,పవైల్ గులాటి వంటి బాలీవుడ్ సెలబ్రిటీలు కొంతమంది హాజరయ్యారట. అయితే వీళ్ళు తాజాగా కొన్ని ఫొటోస్ తమ ఇంస్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు..

Taapsee married secretly.. Photos viral

పవైల్ గులాటి తన సోషల్ మీడియా ఖాతాలో తాప్సీ పన్ను సోదరి షగ్ను పన్నుతో అలాగే మరికొంత మంది సెలబ్రెటీలతో కలిసి గ్రూప్ గా దిగిన ఫోటోని నెట్టింట షేర్ చేశారు.అలాగే కనిక కూడా తన సోషల్ మీడియా ఖాతాలో ఒక ఫోటోని షేర్ చేసి దాని కింద మేరీ యార్ కీ షాదీ అంటూ ట్యాగ్ లకింద పెట్టింది. దీంతో ఈ పోస్ట్ చూసిన చాలామంది నెటిజన్స్ తాప్సీ కి పెళ్లి అయిపోయింది అని,తాప్సి అందరు అనుకున్నట్లే తన పెళ్లిని రహస్యంగా చేసుకుంది అంటూ నెట్టింట్లో పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతూ పోస్టులు పెడుతున్నారు అభిమానులు.మరి ఇప్పటికైనా తాప్సీ తన రహస్య పెళ్లి గురించి బయట పెడుతుందా లేదా అనేది చూడాలి.(Taapsee)

Join WhatsApp