Tamanna: Two glamor beauties in one frame

Tamanna: సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి టాలీవుడ్ అండ్ ఇతర ఇండస్ట్రీలలో దూసుకుపోతున్న హీరోయిన్ మిల్కీ బ్యూటీ తమన్న. ఇప్పటివరకు ప‌లు ఐటమ్ సాంగ్స్ చేసి అందరిని ఆశ్చర్యపరిచిన తమన్నా తాజాగా బొద్దుగుమ్మ రాశి ఖన్నా తో జతకట్టి ఓ ఐటమ్ సాంగ్ ని చేసింది. అది కూడా ఓ హర్రర్ మూవీలో.

Tamanna: Two glamor beauties in one frame

ప్రముఖ నటి ఖుష్బూ భర్త సుందర్ సి హీరోగా..రాశిఖన్నా, తమన్నా ప్రధాన పాత్రలో నటించిన సినిమా ” అరుణ్‌నునై 4 “. తమిళ్ సినీ ఇండస్ట్రీలో భారీ విజయాన్ని అందుకున్న హారర్ కామెడీ సిరీస్ అరుణ్‌మనై. ఈ సిరీస్ నుంచి నాలుగవ చిత్రంగా అరుణ్‌మనై 4 వస్తుంది. ఈ సినిమాను తెలుగులో బాక్ పేరుతో విడుదల చేస్తున్నారు.

Also Read: Tamarind Seeds: వాట్.. చింత గింజలు తినడం వల్ల ఏకంగా ఇన్ని ప్రయోజనాలా?… ఇంతకాలం తెలియక మిస్ అయిపోయామే..!

ప్రస్తుతం ఈ సినిమా అన్ని రంగులు పూర్తి చేసుకుని విడుదలకు రెడీగా ఉంది. బాక్ సినిమా నుంచి రీసెంట్ గా పంచు అనే పాటను విడుదల చేశారు. ఇందులో తమన్నా అండ్ రాశి కన్నా తన గ్లామర్ అందాలతో అదరగొట్టారు. పాటలో తమన్నా, రాశిఖన్నా మూమెంట్స్ ప్రతి ఒక్కరిని అట్రాక్ట్ చేశాయి. ఓకే ఫ్రేమ్లో ఇద్దరు హాట్ బ్యూటీస్ కనిపించడంతో ప్రతి ఒక్కరి ధ్యాస ఈ సినిమాపై మళ్లింది.

Tamanna:  Two glamor beauties in one frame

ఇక తమిళ్లో తరుణ్‌మనై 4 పేరుతో.. తెలుగులో బాక్ పేరుతో ఈ సినిమాను ఏప్రిల్ 26న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించిన మూవీ మేకర్స్.. ఇప్పుడు సైలెంట్ గా సినిమా రిలీజ్ ను వాయిదా వేశారు. ఎండలో తీవ్రత అధికంగా ఉండడం వలన విడుదల తేదీని వాయిదా వేసినట్లు తాజాగా మూవీ మేకర్స్ ప్రకటించారు. ఇక ఈ మూవీ యొక్క కొత్త రిలీజ్ డేట్ ని కూడా ప్రకటించారు.

ఇక అరుణ్‌మనై సిరీస్లో గతంలో వచ్చిన మూడు చిత్రాల్లో సిద్ధార్థ్, త్రిష, ఆర్య, హన్సిక, ఆండ్రియా వంటి స్టార్లు నటించారు.(Tamanna)

Join WhatsApp