Tamannaah changing her real name

Tamannaah: ఇండస్ట్రీలో ఉన్న హీరోయిన్లందరిలో మిల్కీ బ్యూటీ ఎవరు అనగానే అందరికీ టక్కున గుర్తుకొచ్చే పేరు తమన్నా మాత్రమే.. తమన్నా తన అందం,కలర్ తో మిల్కీ బ్యూటీగా పేరు తెచ్చుకుంది. ఇక కొంతమంది హీరోయిన్లు తెల్లగా ఉన్నా కూడా ఫేస్ లో అంత కల ఉండదు.. కానీ తమన్నాకి కలర్ తో పాటు ఫేస్ లో ఉట్టిపడే కల కూడా ఉంటుంది. ఈమె చీర కట్టినా..చుడీదార్ వేసినా..మోడ్రన్ డ్రెస్ వేసినా ఏదైనా సరే ఆమెకు ఇట్టే సెట్ అయిపోతుంది. అయితే అలాంటి తమన్నా తన పేరు ఎందుకు మార్చుకుంది..

Tamannaah changing her real name

పేరు మార్చుకోవడం వెనుక ఉన్న ఆ వ్యక్తి ఎవరు అనే సంగతి ఓ ఇంటర్వ్యూలో చెప్పింది… తమన్నా త్వరలోనే పెళ్లి చేసుకోబోతుంది.. అయితే బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో గత కొద్ది రోజులుగా ప్రేమలో ఉంది. ఇక వీరు త్వరలోనే వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నారు.అయితే ఈ విషయం మాత్రం సీక్రెట్ గా ఉంచేశారు. ఎందుకంటే ఈ మధ్య చాలామంది హీరోయిన్స్ తమ పెళ్లి విషయాన్ని సీక్రెట్ గానే మెయింటైన్ చేస్తున్నారు. (Tamannah )

Also Read: Pradeep: ఆ హీరోయిన్ ని లవ్ లో పడేసిన యాంకర్ ప్రదీప్.. త్వరలోనే పెళ్లి..!

ఇక బాలీవుడ్ సినీ వర్గాల నుండి వినిపిస్తున్న సమాచారం ప్రకారం తమన్నా విజయ్ వర్మల పెళ్లి కూడా ఈ సంవత్సరంలోనే ఉంటుందని తెలుస్తుంది. అయితే రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో తమన్నా మాట్లాడుతూ.. నేను ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇద్దాం అనుకున్న సమయంలో నా పేరు మార్చుకోమని ఓ వ్యక్తి నాకు చెప్పారు. అయితే తెలుగులో తమన్నా అని ఉంటుంది. తమన్నా అంటే హిందీలో కోరిక అనే అర్థం వస్తుందట.

Tamannaah changing her real name

అయితే నా పేరు తెలుగులో తమన్నా లాగా ఇంగ్లీషులో కూడా Tamanna అని ఉండాలి. కానీ ఓ వ్యక్తి Tamanna అనే పేరుకి h జోడించి Tamannaah అని పెట్టుకోమని చెప్పారు. ఇక ఆయన చెప్పినట్టే ఇండస్ట్రీకి వచ్చే ముందు నా పేరు మార్చుకున్నాను. అయితే పేరు మార్చుకున్నాక నా జీవితంలో అన్ని సక్సెస్ఫుల్గానే జరుగుతున్నాయి.పేరు మార్చుకోవడం ఒకింత నాకు కలిసి వచ్చింది.. అంటూ తమన్నా తన పేరు మార్పు కి కారణం తెలిపింది. ఇక తమన్నా ప్రస్తుతం తన ఒక్కో మూవీకి 5 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటూ బిజీబిజీగా గడుపుతోంది.(Tamannaah )

Join WhatsApp